విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా! | Complaint against Gurmeet Ram Rahim for posing as Lord Vishnu | Sakshi
Sakshi News home page

విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా!

Published Mon, Jan 18 2016 6:01 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా!

విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా!

న్యూఢిల్లీ: డెరా సచ్ఛ సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రాంరహీం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వీడియోలో విష్ణుమూర్తిగా కనిపించి.. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆలిండియా హిందూ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'మేం చూసిన ఒక వీడియోలో గుర్మీత్‌ రాంరహీం విష్ణుమూర్తి అవతారంలో  కనిపించారు. ఇది ప్రజల మత మనోభావాలను దెబ్బతీయడమే' అని ఫెడరేషన్ అధ్యక్షుడు నిషాంత్ శర్మ ఫిర్యాదులో తెలిపారు.

ఇటీవల వివాదాస్పద బాబా రాంరహీంను టీవీషోలో అనుకరించి మిమిక్రీ చేసినందుకు హాస్యనటుడు కికూ షార్దాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కికూ షార్దా అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో రాంరహీంపై ఈ ఫిర్యాదు దాఖలు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement