Lord Vishnu
-
నారదుడు విష్ణుమూర్తిని ఎందుకు శపించాడు?స్వయంవరంలో ఏం జరిగింది?
నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకుని తపస్సు ప్రారంభించాడు. ఏళ్ల తరబడి నారదుడి ఘోరతపస్సు కొనసాగుతుండటంతో ఇంద్రుడికి భయంవేసి, నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ మేనక ఊర్వశి తదితర అప్సరసలందరినీ పంపాడు. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు. కొన్నాళ్లు తపస్సు చేశాక, తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి, తపస్సును విరమించుకున్నాడు నారదుడు. బ్రహ్మ వద్దకు వెళ్లి, తన తపస్సు సిద్ధించిందని చెప్పి, అక్కడి నుంచి కైలాసానికి వెళ్లాడు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ‘నా తపస్సు సిద్ధించింది. ఇక శివమాయ నన్నేమీ చేయలేదు’ అన్నాడు. ‘నాయనా! శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు. కాస్త జాగ్రత్తగా ఉండు’ అని హెచ్చరించాడు శివుడు.శివుడి హెచ్చరికను లక్ష్యపెట్టకుండా, నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువుకు నమస్కరించి, ‘లక్ష్మీ జనార్దనులారా! నేను తపస్సిద్ధి పొందాను. నన్ను శివమాయ, విష్ణుమాయ ఏమీ చేయలేవు’ అన్నాడు.‘నారదా! మాయ ప్రకృతి నుంచి పుట్టింది. అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది. దానిని జయించడం ఎవరి వల్లా కాదు’ అని హెచ్చరించాడు విష్ణువు. నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకుని, లోకసంచారానికి బయలుదేరాడు. కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు. నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది. ‘ఏమిటి విశేషం? ఈ సందడంతా దేనికి?’ అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు నారదుడు. ‘రేపే మహారాజు కుమార్తె స్వయంవరం. అందుకే ఈ సందడి’ చెప్పారు వాళ్లు. నారదుడు నేరుగా రాజప్రాసాదానికి వెళ్లాడు. రాజు ఎదురేగి, నారదుడిని స్వాగత సత్కారాలు జరిపి, ఉన్నతాసనంపై ఆసీనుణ్ణి చేశాడు. పరిచారికలను పంపి, తన కుమార్తెను పిలిపించాడు. ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. ‘మహర్షీ! ఈమె నా కుమార్తె రమాలక్ష్మి. రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను. మహావిష్ణువును తప్ప మరెవరినీ వరించనంటోంది’ అని చెప్పాడు. రాకుమార్తెను చూడగానే, నారదుడికి మాయ ఆవరించింది. ‘రాజా! నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి. నీ వంశం తరిస్తుంది’ అన్నాడు. ‘మునీశ్వరా! స్వయంవరంలో కన్య అభీష్టమే ప్రధానం కదా! రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి. మిమ్మల్నే కోరుకుంటుందేమో చూడండి’ అన్నాడు. ‘తప్పకుండా వస్తాను’ అని చెప్పి, నారదుడు తిన్నగా వైకుంఠానికి వెళ్లాడు. ‘రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది. ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటోంది. నీ రూపు నాకు అనుగ్రహించావంటే, స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు’ అని విష్ణువుతో అన్నాడు. ‘నారదా! నువ్వు శివమాయలో పడ్డావు. కోరిక వదులుకుంటే గాని నీకు శాంతి దక్కదు. అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను’ అన్నాడు విష్ణువు.నారదుడికి కోపం వచ్చింది. ‘శివమాయ, విష్ణుమాయ నన్నేమీ చేయలేవు’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు. మర్నాడు స్వయంవరానికి వెళ్లాడు. ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు. రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినే పరికిస్తూ ముందుకు సాగుతోంది.సభా మధ్యంలోకి వచ్చేసరికి సమ్మోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు. ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది. మరుక్షణంలోనే రాకుమార్తెను గరుత్మంతునిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు. ‘రాకుమార్త ఏదీ?’ అని నారదుడు అడుగుతుంటే, సభాసదులంతా అతణ్ణి చూసి గొల్లున నవ్వసాగారు. ‘ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నారు’ ఉక్రోషంగా అడిగాడు నారదుడు. ‘నీ శరీరం విష్ణవులాగా ఉన్నా, ముఖం కోతిలాగ, భల్లూకంలాగ ఉంది’ అన్నారు.ఆగ్రహించిన నారదుడు హుటాహుటిన వైకుంఠానికి వెళ్లి విష్ణువుపై నిప్పులు చెరిగాడు.‘నువ్వు నన్ను మోసం చేశావు. నా ముఖాన్ని కోతిలాగ, భల్లూకంలాగ చేశావు గనుక నువ్వు కూడా కోతులను, భల్లూకాలను ఆశ్రయిస్తావు’ అని శపించాడు.‘నిన్ను నేను మోసం చేయలేదు. శివమాయలో చిక్కుకుని నువ్వే మోసపోయావు’ అన్నాడు విష్ణువు. తన దురుసుతనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకుని లోక సంచారానికి బయలుదేరాడు. ∙సాంఖ్యాయన -
నేటి నుంచి అధిక శ్రావణమాసం? అంటే ఇది డూప్లికేటా?
ఈనెల జూలై 18వ తారీకు నుంచి అధిక శ్రావణమాసం ప్రారంభం అవుతోంది. 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం ఇది. ఈ మాసం నేటి(జూలై 18) నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు అధిక శ్రావణ మాసం ఉంటుంది. అయితే ఈ అధిక మాసం అనేది కేవలం వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం మాసాలకు మాత్రమే వస్తుంది. మిగతా మాసాలకు ఎప్పుడూ అధిక మాసం రాదు. ఐతే ముందుగా ఈ అధిక మాసం వచ్చి ఆ తర్వాత నిజమాసం వస్తుంది. అసలు అధికమాసం ఎందుకు వస్తుంది?. అంటే ఇది డూప్లికేట్ అని అర్థమా? ఎలాంటి జపతప వ్రతాలు ఆచారించాల్సిన పని లేదా? అధికమాసం ఎందుకు వస్తుదంటే.. తెలుగు సంవత్సరాలు, తెలుగు నెలలు, రుతువులు, పంచాంగ గణన ప్రకారం సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ పదకొండుంపావు రోజులు వ్యత్యాసం ఉంటుంది. చాంద్రమాన సంవత్సరం, సౌరమాన సంవత్సరం కన్నా చిన్నది. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. ఇలా ఒక్కొక్కప్పుడు ఒక చాంద్రమాన మాసంలో సౌరమాసం ఆరంభం అవదు. చాంద్రమానంలో సూర్య సంక్రాంతి లేని మాసాన్ని అధికమాసం అంటారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న తేడాను సరిచేసేందుకు చాంద్రమాన సంవత్సరంలో ఒక నెలను అధికంగా జోడించడాన్ని అధిక మాసం అని పిలుస్తారు. ఇది పాటించం అంటే కుదరదు.. కొన్ని ఏళ్ల తర్వాత జోడు శ్రావణ మాసాలు రావడం జరిగింది. శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలను పాటిస్తామో అదేవిధంగా మొదటి శ్రావణంలో కూడా అవే నియమాలను తప్పక పాటించాలి. ఉదాహరణకు కవల పిల్లలు పుడితే వద్దంటామా..? లేదు కదా అలాగే జోడు శ్రావణ మాసాలు వచ్చినప్పుడు కూడా ఒకటి పాటిస్తాం మరొకటి పాటించము అంటే ధర్మశాస్త్రము అంగీకరించదు. కావున రెండూ శ్రావణ మాసాలే. మొదటి శ్రావణ మాసంలో కూడా వ్రతాలు, పూజలు అనగా శ్రావణ సోమవారాలను, శ్రావణ శుక్రవారాలను, శ్రావణ శనివారాల వంటివి, అలాగే మధ్య మాంసాలను స్వీకరించకుండా కేవలం సాత్విక ఆహారాలను మాత్రమే స్వీకరించడం తదితరాలన్ని చేయాల్సిందే. విష్ణువుకి ఎంతో ఇష్టమైనది.. శ్రీమహా విష్ణువుకి మహా ప్రీతికరమైన మాసం ఇది. అందుకే దీన్ని అధిక రాధా పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఈ మాసంలో చేసే దానాలు, వ్రతాలు అధిక ఫలితాలనిస్తాయి. ఈ మాసంలో ఏది దానం చేసిన శ్రీ అధిక రాధా పురుషోత్తమ ప్రీత్యర్థం ఇస్తున్న దానం పేరు చెప్పి కరిష్యే అనాలి. అలాగే ఈ రోజుల్లో శ్రీ అధిక రాధా పురుషోత్తమాయ నమః అని 108 సార్లు జపం చేయాలి. విష్ణువు శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుందని వివరించాడని పురాణ కథనం. (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
అయోధ్య విగ్రహాల కోసం.. సాలిగ్రామ శిలలతోనే ఎందుకంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ అయోధ్య రామాలయం కోసం భారీ రాతి శిలలు.. గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకున్నాయి. ఆదివారం నేపాల్ నుంచి బయల్దేరిన ట్రక్కు.. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇవాళ(గురువారం ఫిబ్రవరి 2) అయోధ్యలో అడుగుపెట్టింది. పూజారులు, స్థానికులు దండలేసి.. ఆ పవిత్రమైన రాళ్లను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పజెప్పారు. వాటిని రామ్ సేవక్ పురంలో భద్రపరిచారు ట్రస్ట్ నిర్వాహకులు. మరి వీటికి ఎందుకంత ప్రత్యేకతో చూద్దాం.. ప్రధాన ఆలయంలోని శ్రీరామ, జానకీ విగ్రహాలను చెక్కేందుకు వీటిని ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు రాళ్లలో ఒకటి 30 టన్నులు, మరొకటి 15 టన్నుల వరకు బరువు ఉంటాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. నేపాల్‌లోని మయాగ్డి-ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కలి గండకి నది ఒడ్డున ఉన్న జలపాతం చెంత నుంచి ఈ రెండు భారీ శిలలను తెప్పించారు. అంతకు ముందు సీత జన్మస్థలంగా భావించే జనక్‌పూర్(నేపాల్)లో వీటికి ప్రత్యేక పూజలు జరిగాయి కూడా. శాలిగ్రాముల ప్రత్యేకత ఏంటంటే.. సాలిగ్రామ (శాలిగ్రామ).. సాలిగ్రామ శిలలని కూడా పిలుస్తారు. నేపాల్ గంకీ రాష్ట్రంలో.. దామోదర్ కుండ్ నుంచి గండకీ నది ఉద్భవిస్తుంది. గండకీ నదికి ఉపనది అయిన కలి గండకీ ప్రవాహ తీరంలోనే ఇవి కనిపిస్తాయి. ఆ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 6వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఈ శిలలను విష్ణు మూర్తికి ప్రతీకలుగా భావిస్తారు. వాస్తవానికి.. ఇవి డెవోనియన్-క్రెటేషియస్ కాలానికి చెందిన అమ్మోనైట్ షెల్ శిలాజాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇవి ఇక్కడ ఉంటున్నాయి. హిందువులు ఈ శిలాజాలను పవిత్రమైనవిగా గౌరవిస్తారు. ఎందుకంటే.. మధ్వాచార్య, అస్తమూర్తి(వ్యాసదేవ) నుండి అందుకున్నాడని, అందుకు వాటిపై ఉండే విష్ణు చిహ్నాలు, ముఖ్యంగా శంఖాన్ని పోలి ఉండడమే కారణమని భావిస్తారు. అదీ కాకుండా.. జానకీ మాత జన్మించిన నేల కావడంతో ఈ శిలలకు ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడ ఉన్న శిలలకు కోట్లాది ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ విగ్రహాలు కూడా.. ఉడుపి కృష్ణ మఠంలో కృష్ణ విగ్రహం, బృందావనంలోని రాధా రామన్ ఆలయం, తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం, గర్వాల్లోని బద్రినాథ్ ఆలయంలోని విగ్రహాలు సాలిగ్రామ్ శిలలతోనే తయారు చేసినట్లు తెలుస్తోంది. దేవీ భాగవతా పురాణా, బ్రహ్మవైవర్థ పురాణా, శివ పురాణాలలో సాలిగ్రామ శిలల ప్రస్తావన కూడా ఉంది. కొన్ని నివేదికల ప్రకారం.. ఆదిశంకర రచనలలోనూ.. సాలిగ్రామ(శాలిగ్రామ) శిలల గురించి ప్రత్యేక ప్రస్తావన ఉంది. తైత్తిరీయ ఉపనిషత్తులోని 1.6.1వ శ్లోకం, బ్రహ్మ సూత్రాలలోని 1.3.14 శ్లోకాలకు ఆదిశంకర తన విష్ణువు ఆరాధనలో శిల ఉపయోగించడం సుప్రసిద్ధ హిందూ ఆచారంగా ఉండేదని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇవేకాదు.. చాలాచోట్ల సాలిగ్రామ శిలలు కొన్ని నకిలీవి వాడుకలో ఉండడం గమనార్హం. -
నేను కల్కి అవతారాన్ని, నా గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వండి లేదంటే..
అహ్మదాబాద్: ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన గ్రాట్యూటీ కోసం సరికొత్తగా బెదిరించాడు ఓ మాజీ ఉద్యోగి. ఈ విచిత్ర ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జలవనరుల శాఖ మాజీ ఇంజినీర్ రమేశ్చంద్ర ఫెఫార్ ఇట తన గ్రాట్యూటీని విడుదల చేయాలని బెదిరిస్తూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో.. తనను తాను విష్ణువు కల్కి అవతారంగా చెప్పుకున్నాడు. అదే క్రమంలో తన జీతం, గ్రాట్యుటీ ఇంకా రాలేదని ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వంలో కూర్చున్న రాక్షసులు తన రూ.16 లక్షల గ్రాట్యుటీ, ఒక సంవత్సరం జీతం రూ.16 లక్షలను ఇవ్వకుండా తనను వేధిస్తున్నారని ఆయన రాశారు. వెంటనే వీటిని విడుదల చేయకపోతే ఈ సంవత్సరం తన "దైవిక శక్తులతో" భూమిపై తీవ్రమైన కరువును సృష్టిస్తానని ఆ లేఖలో బెదిరించాడు. కాగా ఫెఫార్ చాలాకాలం విధులకు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వం ఆయనకు ముందస్తు పదవీ విరమణ ఇచ్చింది. 8 నెలల్లో 16 రోజులే ఆఫీసుకు రావడంపై ప్రశ్నిస్తూ ఆయనకు షోకాజ్ నోటీసు కూడా ఇచ్చింది. కాగా తన బెదిరింపులపై స్పందించిన జల వనరుల శాఖ కార్యదర్శి ఎం కె జాదవ్ మాట్లాడుతూ.. అతని గ్రాట్యుటీ ప్రక్రియలో ఉందంటూ చెప్పారు. -
ఒకే శరీరం.. త్రిమూర్తుల శిరస్సులు
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలు ఒకే విగ్రహంగా ఉన్న అరుదైన శిల్పం వెలుగుచూసింది. చరిత్ర పరిశోధకులు, కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ, అమరావతి సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి 13వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహాన్ని గుర్తించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలోని శిథిల నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఇది బయటపడింది. ఆ ఆలయాన్ని పదిలం చేసుకునే కసరత్తులో భాగంగా స్థానికులు శుభ్రపరుస్తుండగా ఈ విగ్రహం కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు శివనాగిరెడ్డి అక్కడికి వెళ్లి దాన్ని పరిశీలించారు. ఒకే శరీరానికి మూడు తలలున్న ఆ విగ్రహం ఎంతో ప్రత్యేకమైందని, ఇప్పటివరకు హరి, హర, పితామహ రూపాలు ఒకే విగ్రహంలో ఉండటం అరుదని అన్నారు. ఈ విషయమై కొత్త తెలంగాణ చరిత్ర బృంద ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్, చరిత్ర పరిశోధకులు జైశెట్టి రమణయ్యలను సంప్రదించగా, గతంలో ఈ రూపంలో విగ్రహం వెలుగుచూసిన దాఖలాలు లేవని వారు పేర్కొన్నట్టు నాగిరెడ్డి వెల్లడించారు. తొలితరం కాకతీయులు జైన ఆరాధకులని, రుద్రదేవుడి నుంచి శైవంపట్ల మొగ్గుచూపారని పేర్కొన్నారు. గణపతిదేవుడి కాలంలో హరిని, హరుడిని విడిగా ఆరాధించేవారి మధ్య ఆధిపత్య పోరు పెరగకుండా ఉండేందుకు, అంతాసమానమనే భావన కల్పించేందుకు ఇలాంటి శిల్పాన్ని ఏర్పాటు చేయించి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామ చివరన ఉన్న పురాతన శివాలయం వద్ద 13వ శతాబ్దానికి చెందిన ఆసీన వీరభద్ర, భద్రకాళి, భైరవ, మహిషాసుర మర్ధిని, అగస్త్య మహాముని విగ్రహాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. అరుదైన విగ్రహాలతో కూడిన మందిరాలను పరిరక్షించాలని హెరిటేజ్ తెలంగాణ అధికారులను ఆయన కోరారు. -
హరిహరమూర్తి
శివుడు వేరు, విష్ణువు వేరు అని అందరూ అనుకుంటారు కానీ వారిద్దరూ ఒక్కటే.వారిలో ఎటువంటి భేదాలూ లేవని భక్తులకు తెలియజెప్పడానికి శివుడు ధరించిన రూపమే హరిహరమూర్తి రూపం. పూర్వం దేవతలు లోకం అశాంతిగా ఉందని విష్ణువు వద్దకు వెళ్లారు. శాంతినిచ్చేవాడు శంకరుడే అని విష్ణువు వారికి తెలిపాడు. అందరూ కలిసి కైలాసం వెళ్లి చూస్తే అక్కడ శివదర్శనం కాలేదు. అప్పుడు దేవతలంతా ఒక వ్రతం ఆచరించారు. చివరగా విష్ణు హృదయంలోని అక్షయ లింగాన్ని కూడా ఆరాధించారు. చివరికి శివుడు వారికి హరిహరమూర్తి రూపంలో దర్శనమిచ్చాడు. తమిళనాడులోని తిరునెల్వేలి దగ్గర శంకరన్ కోవిల్ అనే ఊరిలో శంకరనారాయణ స్వామి ఆలయం ఉంది.అందులో ప్రధాన దైవం శంకరనారాయణమూర్తి. ఈ స్వామి విగ్రహంలో నిలువుగా కుడి సగం ఈశ్వరుడిగా, ఎడమసగం విష్ణురూపంగా ఉంటుంది. ఇక విగ్రహం రూపురేఖలు వర్ణిస్తే కుడివైపు జటాజూటం, చెవికి తాటంకం, మెడలో నాగరాజు, కుడిచేత అభయముద్రను, వెనుక చేతిలో గొడ్డలి, పులి చర్మం ధరించి చందనపు పూతతో శివుడు దర్శనమిస్తే, ఎడమవైపు రత్నకిరీటం, చెవికి మకరకుండలం, మెడలో బంగారుహారాలు, కుడిచేతిని నడుము వద్ద ఉంచుకుని కటిముద్రతో, వెనుక చేతిలో శంఖాన్ని పట్టుకుని, పట్టు పీతాంబరాలు ధరించి నీలవర్ణంలో విష్ణువు దర్శనమిస్తాడు. ఈ స్వామి దర్శనంతో భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఈ స్వామిని చూచిన భక్తులకు ఇహలోకంలో సౌఖ్యం, పరలోకంలో మోక్షం తథ్యం అని శైవాగమాలు చెబుతున్నాయి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
అమృతాన్నిచ్చిన ఆయుర్వేద దేవుడు
ఆయన మహావిష్ణువు అంశావతారం. మానవులకు ఆయుర్వేదాన్ని అనుగ్రహించినవాడు. సకల దేవతలు, దైత్యులు కలిసి చేసిన సముద్రమథనంలో చివరిగా అమృతం వెలువడింది. ఆ అమృత కుంభాన్ని తీసుకుని వచ్చిన దివ్యపురుషుడు ధన్వంతరి. ఆయన సముద్రం నుండి వస్తున్నప్పుడు దశదిశలా వెలుగు విరజిమ్మింది. ఆయన సింహం వంటి పరాక్రమశాలి. సాక్షాత్తూ విష్ణుస్వరూపుడిగా భాసిల్లుతున్న ఆయనే శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు ఆయన అంశావతారంగా ద్వాపరయుగంలో కాశీరాజు ధన్వుని కుమారుడిగా పుట్టి ఆయుర్వేద దేవుడిగా పేరు పొందిన ధన్వంతరి. ఆయన దేవవైద్యుడు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరుకు సమీపంలో సోమనాథపురమనే ఒక ఊరుంది. అక్కడ కేశవదేవాలయమనే త్రికూట దేవాలయం ఉంది. హొయ్సళరాజులకాలంలో నిర్మించబడిన అత్యద్భుతశిల్పకళ ఆ ఆలయం సొంతం. ఆ ఆలయం చుట్టూ అలంకరించబడిన అనేక వైష్ణవ శిల్పాలలో ధన్వంతరి విగ్రహం విశేషమైనది. ఈ శిల్పం ఆసీనస్థితిలో ఉంటుంది. కుడిచేతిలో అమృత కలశాన్ని, ఎడమచేతిలో ఔషధమూలికలను కలిగి ఉంటుంది. శ్రీరంగం తమిళనాడులోని ప్రముఖ వైష్ణవక్షేత్రం.అంతేగాక 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. ఇక్కడి రంగనాథస్వామి ఆలయానికి వెనుకవైపు ధన్వంతరిస్వామివారి ఆలయం ఉంది. ఆ ఆలయంలో స్వామి నిత్యపూజలందుకుంటున్నాడు. గర్భగుడిలోని స్వామివారు నిలుచుని ఉన్న భంగిమలో ఉండి, కుడిచేతిలో అమృతకలశాన్ని, ఎడమచేతిలో ఔషధీమూలికను పట్టుకుని, వెనుక చేతులలో కుడివైపు చక్రాన్ని, ఎడమవైపు శంఖాన్ని ధరించి దివ్యమంగళ స్వరూపంలో దర్శనమిస్తాడు. ధన్వంతరిని దర్శించుకుంటే దేహాన్ని బాధించే సాధారణ రోగాలేగాక నయంకాని మొండి జబ్బులనుండి కూడా ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతారు. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
చింతలను దూరం చేసే త్రివిక్రముడు
మహావిష్ణువు ధరించిన దశావతారాలలో ఐదవ అవతారం వామనావతారం. సకల లోకాలను రాక్షసుల బారినుండి రక్షించడానికి శ్రీమహావిష్ణువు వామనావతారం ధరించాడు. ఒక బాలవటువు రూపంలో బలిచక్రవర్తి యజ్ఞం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ బాలుణ్ణి ఏం కావాలని అడిగితే తనకు మూడు అడుగుల ప్రదేశం చాలన్నాడు. అదెంత భాగ్యం అని ఇచ్చేశాడు. మరుక్షణంలో ఆ బాలుడు అమాంతం పెరిగిపోయాడు. భూమిని ఒక్క అడుగుతోనే ఆక్రమించాడు. రెండో అడుగుతో ఆకాశాన్ని స్వాధీనం చేసుకుని మూడోఅడుగు ఎక్కడ పెట్టాలని అడిగితే తన తలపై పెట్టమని చెప్పాడు బలిచక్రవర్తి. అలా మూడు అడుగులతో మూడులోకాలనూ ఆక్రమించినవాడే త్రివిక్రముడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అద్భుతమైన శిల్పసౌందర్యంతో అలరారే చింతల వెంకటరమణస్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయంపై అనేక పురాణ ఘట్టాలను శిల్పరూపంలో మనం దర్శించవచ్చు. పైన వివరించిన త్రివిక్రమావతారం కథను తెలిపే అద్భుతశిల్పం అక్కడ ఉంది. ఈ శిల్పం విశేషమేమిటంటే సాధారణంగా ఎక్కడైనా త్రివిక్రముడి ఒక కాలిని భూమిపై, మరో కాలు ఆకాశంలో ఉండి బ్రహ్మతో కడగబడుతూ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మూడోకాలు బలి తలపై ఉంచడం కూడా స్పష్టంగా చూపించడం జరిగింది. ఇటువంటి శిల్పం బహుశా ఇదొక్కటే అని స్పష్టంగా చెప్పవచ్చు. కుడిచేతిలో అభయముద్ర చూపుతూ ఎడమచేతిని పాదంపై పట్టి ఉంచి, వెనుక చేతులలో కుడివైపు శంఖాన్ని, ఎడమవైపు చక్రాన్ని ధరించి బ్రహ్మతో కడగబడుతున్న పాదం కల త్రివిక్రముడి శిల్ప సందర్శనం చింతలను దూరం చేస్తుందని ప్రతీతి. – డాక్టర్ ఛాయా కామాక్షీదేవి -
‘మోదీ విష్ణుమూర్తి 11వ అవతారం’
ముంబై : మహారాష్ట్ర బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీని విష్ణుమూర్తి పదకొండో అవతారంగా పేర్కొంటూ చేసిన ట్వీట్‌పై వివాదం చేలరేగుతుంది. మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్ వాఘ్ ‘మన మాన్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీ విష్ణు మూర్తి 11వ అవతారం’ అంటూ ట్వీట్ చేశారు. అయితే వాఘ్ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. బీజేపీ నాయకులు దేవతలను అవమానిస్తున్నారంటూ కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఇలాంటి కామెంట్లు బీజేపీ చౌకబారు రాజకీయాలకు ప్రతీకగా వారు ఆరోపిస్తున్నారు. వాఘ్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్ అని చెప్పుకుంటూ ఇలాంటి మాటలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు సరైనవో కావో చెక్ చేసుకోవాలంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. -
సుదర్శన చక్రం
శ్రీమన్నారాయణుడి సుగుణ రూపం స్మరించుకొంటే మనో ఫలకంలో కనిపించేది శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజ విగ్రహం. హరి పూరించే శంఖానికి పాంచ జన్యం అని పేరు. హరి ధరించే చక్రాయుధం సుదర్శన చక్రం. వైష్ణవ భాగవతులకు సుదర్శన చక్రం కేవలం ఒక చక్రమూ, ఆయుధమూ కాదు. అది చక్రరూపంలో ఉన్న భగవానుడే. సుదర్శన చక్రాన్ని శివుడు శ్రీహరికి కానుక చేశాడని ఒక పురాణ కథ కనిపిస్తుంది. సూర్యుడి అపరిమితమైన తేజస్సువల్ల ఆయన భార్య సంధ్యా దేవికి కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించేం దుకు దేవశిల్పి మయుడు సూర్య తేజస్సును కొంత తగ్గించేందుకు సహాయం చేశాడనీ, ఆ తరుగు తేజ స్సుతో ఆయన నిర్మించిన వస్తువులలో సుదర్శన చక్రం ఒకటి అనీ పురాణ కథ. ఖాండవ వనాన్ని యథేచ్ఛగా దహించి భుజిం చుకొమ్మని కృష్ణా ర్జునులు అగ్ని దేవుడికి అభయం ఇచ్చిన సంద ర్భంలో, అగ్నిదేవుడు ఈ సుదర్శన చక్రాన్ని కృతజ్ఞతాపూర్వకంగా బహూకరించాడని మహాభారతం ఆది పర్వంలో ఒక ఉపాఖ్యానం చెప్తుంది. తనకు వర సకు మేనత్త కొడుకూ, చేది రాజు అయిన శిశుపాలుడు రాజసభలో తనను నిష్కారణంగా నిందిస్తుంటే, నూరు అపరాధాలు దాటే దాకా వేచి ఉన్న శ్రీకృష్ణుడు, తన సుదర్శనం ప్రయోగించి, అక్కడికక్కడే అతగాడి శిరస్సు ఖండించాడని సభాపర్వంలో కనిపిస్తుంది. భాగవత పురాణంలో, కరిని మకరి నుండి రక్షించి గజేంద్రమోక్షం కలిగించటానికి హరి వాడిన ఆయు ధం సుదర్శనమే. తిరుమల క్షేత్రంలో స్వామివారి చక్రాయుధం స్వామికి కుడిభుజంగా, ఆయన కుడిభుజం మీద దర్శ నమిస్తుంది. తిరుమలకు వెళ్లే యాత్రికులను, ఇల్లు వదిలినప్పట్నుంచీ యాత్ర ముగించుకుని మళ్లీ ఇల్లు చేరేవరకూ సురక్షితంగా ఉంచే బాధ్యత సుదర్శన చక్రం నిర్వహిస్తుందట. బ్రహ్మోత్సవాలు జరిగే రోజు లలో సుదర్శనుడి ఉత్సవమూర్తి ఊరేగి, ఏర్పాట్లన్నీ పర్య వేక్షించి, స్వామివారు రాబోతున్నారని బహు పరా కులూ, హెచ్చరికలూ వినిపించటం ఆనవాయితీ. ఈ సేవలన్నింటికీ గుర్తింపుగా, బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో, వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో తనకు జరిగే పన్నీటి స్నానాలకు, స్వామి సుదర్శనుడిని ప్రత్యేకంగా పిలిపించి, తనతోపాటు అభిషేకాలు జరిపిస్తారు. ఆ తరువాత, సుదర్శన చక్రత్తాళ్వారుకు మాత్రం స్వామి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. ఆ పుణ్య సమ యంలో దేవతాగణాలు కూడా ఆ పుష్కరిణిలోనే స్నానం చేసి పునీతమవు తాయట. చక్రస్నానంవేళ, వేలాది భక్తులు కూడా పుష్కరిణిలో స్నానంచేసి ధన్యులవుతారు. – ఎం. మారుతి శాస్త్రి -
విరజా నది
శ్రీమన్నారాయణుడు శ్రీరామచంద్రుడిగా భద్రాద్రి మీద కొలువై ఉంటాడు. నిజానికి వైకుంఠమే కొద్ది పాటి మార్పులతో భద్రాచల శిఖరం అయింది అంటాడు భక్తాగ్రేసరుడు భద్రాచల రామదాసు. అలాగే దక్షిణాది వైష్ణవులు శ్రీరంగ మహా క్షేత్రాన్ని వైకుంఠ ధామంగా భావిస్తారు. వాళ్లకు కావేరీ నదే విరజానది. ఆ విరజానదే ఈ కావేరి, శ్రీరంగనాథ ఆలయమే వైకుంఠం. శ్రీహరి విరజా తీరంలో, దివ్య భోగాలతో ఇందిరా సహితుడిగా ఎలా శోభిల్లుతుంటాడో, అచ్చం అలాగే కావేరీ తీరంలో శ్రీరంగధాముడై సౌఖ్య శ్రీలతో చెన్నారుతుంటాడు, అంటుంది శ్రీరంగ మహాత్మ్య కావ్యం. విరజ అనే పౌరాణిక నాయిక బ్రహ్మకైవర్త పురాణంలో కనిపిస్తుంది. ఈమె అతిలోక సౌందర్యవతి. రాధాకృష్ణులు నివసించే గోలోకంలోనే ఈమె నివాసం కూడా. ఈమె కూడా తన మధుర భక్తితో రాధా వల్లభు డిని వలచి, వలపించుకొన్న ధన్యురాలు. ఒకానొక సమయంలో శ్రీకృష్ణుడు విరజా దేవితో విహరిస్తుండగా, రాధాదేవి కంటబడతాడు. రాధాదేవి కోపించి, విరజను నదిగా మారిపొమ్మని శపిస్తుంది. నదీ రూపం పొందినా, విరజ వైకుంఠాన్ని తన తీరంలో కలుపుకొని, వైకుంఠుడయిన నారాయణుడితో సాన్ని హిత్యాన్ని కొనసాగిస్తూ ఆయనను సేవిస్తూనే ఉంది. విరజకు శ్రీహరి ద్వారా ఏడుగురు పుత్రులు కలిగారు. కానీ ఆ బిడ్డల ఆలనా, పాలనా, పోషణ తనను శ్రీకృష్ణ సాంగత్యానికి దూరం చేస్తున్నాయన్న వేదనతో, ఆమె తన సంతానాన్నే సప్త సముద్రాలుగా మార్చి వేసిందట. ‘అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు. అమా యకులైన పిల్లలనెందుకమ్మా అలా శపించావు?’ అని ప్రశ్నించాడట వైకుంఠంలో శ్రీహరి ఆంతరంగిక సేవ కులలో ఒకడైన సుదాముడు. దాంతో, విరజ ఆయన మీద కూడా కోపించి ‘నువ్వు రాక్షసుడిగా పుడతావు!’ అని శపించిందట. ఫలితంగా సుదాముడే శంఖ చూడుడనే రాక్షసుడిగా పుట్టాడు. పురాణ కథలు ప్రతీకాత్మకమైన పాత్రల ద్వారా, కథల ద్వారా ధర్మాన్ని, సన్మార్గాన్నీ బోధించుతాయి. ఈ కోణం నుంచి చూస్తే విరజా నది అంటే రజం లేనిది. రజం అంటే దుమ్మూ, ధూళీ, మాలిన్యం, కాలుష్యం. కాలుష్యం లేని పరిశుద్ధమైన, పావనమైన నది విరజా నది. కల్మషమూ, కాలుష్యమూ లేని శుద్ధ త్వాన్నీ, పవిత్రతనూ భగవంతుడైన శ్రీహరి అభిమా నిస్తాడు. కనుక ఆయన నివాసం విరజా నదీ తీరంలో. కల్మషం లేని, పరిశుద్ధతగల విరజమైన పరిసరాల లోనూ, అంతఃకరణాలలోనూ భగవంతుడు నెలవై ఉంటాడు. – ఎం. మారుతిశాస్త్రి -
వరాల స్వామి
దశావతారాల్లో ఆదివరాహావతారం సుప్రసిద్ధమైనది. జలప్రళయంలో చిక్కుకున్న భూమండలాన్ని శ్రీ మహావిష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి, తన కోరలపై భూగోళాన్ని నిలిపినట్లు పురాణ కథనం. తిరుమలలో తొలిపూజలు ఆదివరాహమూర్తికేనన్న విషయం అందరికీ తెలిసిందే. క్షేత్రపాలకుడైన ఆదివరాహమూర్తిని దర్శించుకుని, అర్చనలు చేసుకున్న తర్వాతనే కలియుగదైవాన్ని దర్శించుకోవాలని, లేదంటే తనను దర్శించుకున్న ఫలితం దక్కదని సాక్షాత్తూ శ్రీనివాసుడే ఆదివరాహమూర్తికి ఒప్పంద పత్రం రాసి ఇచ్చిన ఉదంతమూ మనకు వేంకటేశ్వర మహాత్మ్యంలో కనిపిస్తుంది. అయితే ఆదివరాహమూర్తి ఆలయాలు కేవలం రెండే ఉన్నాయి. తిరుమల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కరీనంగర్ జిల్లా కమాన్‌పూర్ మండలంలో మరో ఆది వరాహమూర్తి ఆలయం ఉంది. అరుదైన ఈ ఆలయ విశేషాలు... స్థలపురాణం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఆది వరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆయన కలలో ఆది వరాహస్వామి ప్రత్యక్షం అయి, దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతిపైన శ్రీ మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వెలిశాడు. అయితే, ఈ విషయం ఎవరికీ తెలియక పోవడంతో క్రమేణా విగ్రహం మరుగున పడింది. ఇటీవల అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తవ్వకాలలో స్వామి వారి విగ్రహం బయట పడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి, ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రాంభించారు. ఇక్కడ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారి కోరికలు తీరుతుండడంతో అందరూ కూడా స్వామిని వరాల స్వామిగా కొలుస్తున్నారు. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ఆలయానికి సమీపంలో బుల్డోజర్లతో భూమిని చదును చేస్తుండగా బుల్డోజర్ ముందుకు కదలనంటూ మొరాయించింది. ఎందుకిలా జరిగిందంటూ అక్కడ పరిశీలించగా ఒక బండరాయి మీద స్వామివారి పాదముద్రలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడినుంచి ఆలయం వరకూ స్వామివారు నడచి వస్తున్నట్లుగా పాదముద్రలు కనిపించడంతో మరింత భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు భక్తులు. ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని గత పది సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడా భక్తుడు. ఇంతలో ఆ భక్తుని కలలో స్వామివారు కనిపించి, తనకు ఏ విధమైన మందిరంగానీ, గోపురం గానీ నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తూ, అక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నాడు భక్తుడు. ఇంతింతై వటుడింతై... జిల్లాకు తూర్పుదిశగా ఒక బండరాతి మీద చిన్న ఎలుక పరిమాణంలో తొలుత భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు, తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి, రెండు అడుగుల కన్నా పెద్దగా పెరిగారు. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం. స్వామివారికి నిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనల జరుగుతుంటాయి. ఎలా వెళ్లాలి? కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్లే బస్సులు కమాన్‌పూర్ మీదుగానే వెళ్తాయి. కమాన్‌పూర్ వెళ్తే, స్వామి వారి ఆలయానికి కాలనడకన చేరుకోవచ్చు. లేదంటే ఆటోలు ఉన్నాయి. గోదావరి ఖని నుంచి పెద్దపల్లికి వెళ్లే బస్సులు కమాన్ పూర్ మీదుగానే వెళ్తాయి. కమాన్‌పూర్‌కి దగ్గరగా ఉన్న రైల్వేస్టేషన్ పెద్దపల్లి. అక్కడినుంచి కమాన్‌పూర్‌కు బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. - డి.వి.ఆర్. -
విష్ణుమయం
ఆత్మీయం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీహరి. అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ తానుంటానన్నాడు కాబట్టి విష్ణువును స్థితికారుడనీ, సమస్త ప్రాణులనూ రక్షించే వాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. విష్ణువు అంటే విశ్వమంతా నిండిన వాడని అర్థం. ఈ సృష్టిలో అత్యుత్తమమైనవిగా పేర్కొనదగ్గ జ్ఞానం, అమరత్వం, వాత్సల్యం, సౌశీల్యం మొదలైన సమస్త సద్గుణాలు, నవరస భరితాలైన వస్తు వాహనాభరణాలు, రాజోపచారాలు, దైవోపచారాలు, సమస్త సదాచారాలకు ఆధారభూతమైన సంపదలన్నింటికీ శ్రీహరే ఆధారభూతుడు. సమస్త దేవగణాదులలోనూ విష్ణువు కంటే మిన్న అనదగ్గవాడు లేడు. అదేవిధంగా ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరి మంత్రం కంటె అధికమైనది లేదు. దుష్టరాక్షసులకు వరాలనిచ్చి, లోకాలను ఇబ్బందుల పాలు చేసి, చివరకు తాము కూడా ఇబ్బందుల పాలైన బ్రహ్మను, మహేశ్వరుడినీ కూడా విష్ణువే కాపాడిన ఉదంతాలు మనం చూస్తుంటాం. మంత్రపుష్పం అంతా విష్ణుమయమే. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణుభగవానుని విశేషాలు తెలిపేవే విష్ణు సహస్రనామాలు. ఈ నామాలన్నీ విశ్వవ్యాప్తమైన ఆయన శక్తిని, అనంతమైన ఆయన లీలలనూ తెలియచేస్తూ, మనం ఏ రూపంలో భగవంతుడిని కొలిచినా దేవుడొక్కడే అనే భావనను కలుగచేస్తాయి. -
బిడ్డల సంతోషమే తండ్రి సంతోషం
మనకు ఐదు ఇంద్రియాలున్నాయి. ఈ ఇంద్రియాలకు అధిదేవత విష్ణువు. అధోక్షజుడు అని కూడా అంటారు. ఈ ఇంద్రియాలు ఏర్పడడానికి అవసరమైన వ్యూహానికి అనుగుణమైన వీర్యాన్ని నిక్షేపించిన వాడు తండ్రి. ఆయన వదిలిన తేజస్సునుంచే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో సంఘాతమైన ఈ శరీరం తయారయింది. కాబట్టి తండ్రి సాక్షాత్ విష్ణువే. సమస్త సుఖదుఃఖాలకు కారణం ఆయనే. భూమండలాన్నంతటినీ శ్రీమహావిష్ణువు రక్షిస్తుంటాడు. ఒకానొకప్పుడు ఆదివరాహమూర్తిగా దంష్ట్రల మీద పైకెత్తాడు. ఆయన సతీస్వరూపంగా భూదేవి ఉంటుంది. అటువంటి భూమి సమస్త సుఖాలకు కారణం. ఈ భూమికి ’క్షితి’ అని పేరు. ’క్ష’కారం ’ఓర్పు’కి మారువాచకం. భూదేవికి ఎంత ఓర్పంటే... మనం ఉండడానికి, బతకడానికి ఆధారంగా ఉంటుంది. ఆకలేస్తే అన్నం తింటున్నామంటే అది భూమిచ్చిన పదార్థమే. దాహమేస్తే నీళ్ళు తాగుతున్నామంటే అది భూమి చలవే. ఊపిరి తీసుకుంటున్నామంటే అది భూమ్మీద ఉండే గాలే. తిన్నదాంట్లో శేషం మిగిలితే మళ్ళీ భూమే దాన్ని పట్టుకుంటుది. తాగిన దాంట్లో శేషం మిగిలితే భూమే పుచ్చుకుంటుంది. మనం విడిచిన గాలికూడా ప్రకృతే తీసుకుంటుంది. సకలభోగాలకూ ఆమే కారణం. అందుకే వసుంధర అని పేరు. ఆమె విష్ణువు సొత్తు. అసలు ఆనందమంతా ఆయన అనుభవించాలి. కానీ ‘అయ్యో! వీళ్ళు నా బిడ్డలు, నన్ను నమ్ముకుని ఉన్నారు’ అని అదంతా మనకిస్తున్నాడు. మనం అనుభవిస్తుంటే అది చూసి ఆయన సంతోషిస్తుంటాడు. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు తండ్రిరూపంలో ఉంటారు. తనదైన దానిని భక్తులకిచ్చి, తన భక్తులు సంతోషిస్తుంటే చూసి ఆనందించడం విష్ణువు స్వభావం. తండ్రి లక్షణం కూడా అదే. ఒకసారి వ్యాసరచనపోటీలో ఒక మహమ్మదీయ విద్యార్థిని రాసిన ఒక వ్యాసం చదివి కన్నీటిపర్యంతమయ్యాను. 42ఏళ్ళ తండ్రి తనకు బ్లడ్కాన్సరని ముందే తెలిసినా ఏనాడూ బిడ్డలకు చెప్పలేదు. వారికోసం ఆయనెంతో కష్టపడుతుండేవాడు. చివరకు చనిపోయినప్పుడు బంధుమిత్రులందరూ వచ్చి ఆయన గుండెనిబ్బరాన్ని పిల్లలపట్ల ప్రేమను పొగుడుతుంటే... అందరికీ ముందే తెలిసిన విషయం తమకు ఎందుకు చెప్పలేదని తల్లిని నిలదీశారు. ‘‘ఎలాగూ చావు తప్పదు. అప్పుడు బాధపడక తప్పదు. ముందే పిల్లలకు తెలిస్తే ఇప్పటినుంచే బాధపడతారు. వాళ్ళు బాధపడుతుంటే నా బొందిలో ప్రాణం ఉండగా నేను చూడలేను. అందుకే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దని మీ నాన్న నా చేత ఒట్టేయించుకున్నాడు’’ అని మా అమ్మ చెప్పిందని రాసింది. అదీ తండ్రి ప్రేమంటే, అదీ విష్ణుస్వరూపమంటే. తండ్రి స్వయంగా కష్టపడతాడు. కానీ తన బిడ్డలు మాత్రం సుఖపడాలని కోరుకుంటాడు. తాను శ్రమపడి తెచ్చింది తాను అనుభవించడు. అంతా తన బిడ్డల సంతోషానికి ఉపయోగిస్తాడు. తను స్వయంగా వాటిని అనుభవించకపోయినా, బిడ్డలు అనుభవిస్తుంటే వారి ముఖాల్లోని ఆనందాన్ని చూసి తెగ మురిసిపోతాడు. -
అనంతపురం కోర్టులో ధోనీకి ఊరట!
అనంతపురం: అనంతపురం కోర్టులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఊరట లభించింది. ఓ కేసులో ఆయనకు వ్యతిరేకంగా తాను ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఉత్తర్వులను కోర్టు వెనుకకు తీసుకుంది. బిజినెస్ మ్యాగజీన్ కవర్ పేజీపై ధోనీ విష్ణుమూర్తి అవతారంలో కనిపించి.. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ స్థానిక వీహెచ్‌పీ కార్యకర్త వై శ్యాంసుందర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత ఏడాది జనవరి 7న ధోనీకి వ్యతిరేకంగా అనంతపురం కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ధోనీ తరఫున ఢిల్లీకి చెందిన న్యాయవాదులు రాజనిష్ చోప్రా, పంకజ్ భగ్లా మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. గతంలో కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌కు ధోనీకి అందలేదని వారు మేజిస్ట్రేట్ గీతావాణికి తెలిపారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు తన ఉత్తర్వులను వెనుకకు తీసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ధోనీ టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీ తరఫున ఆయన కేసును ఇకముందు తాను వాదించేందుకు అనుమతి ఇవ్వాలంటూ న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి 'వకాలత్‌నామా'ను దాఖలుచేశారు. -
విష్ణుమూర్తిగా వివాదాస్పద బాబా!
న్యూఢిల్లీ: డెరా సచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ వీడియోలో విష్ణుమూర్తిగా కనిపించి.. ఆయన హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆలిండియా హిందూ ఫెడరేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'మేం చూసిన ఒక వీడియోలో గుర్మీత్ రాంరహీం విష్ణుమూర్తి అవతారంలో కనిపించారు. ఇది ప్రజల మత మనోభావాలను దెబ్బతీయడమే' అని ఫెడరేషన్ అధ్యక్షుడు నిషాంత్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల వివాదాస్పద బాబా రాంరహీంను టీవీషోలో అనుకరించి మిమిక్రీ చేసినందుకు హాస్యనటుడు కికూ షార్దాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కికూ షార్దా అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో రాంరహీంపై ఈ ఫిర్యాదు దాఖలు కావడం గమనార్హం. -
అనంత పద్మనాభుడిని మేలుకొల్పేదెలా?
న్యూఢిల్లీ: దేవదేవుడు విష్ణుమూర్తిని ఎలా నిద్రలేపాలనే అనేదానిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాదాపు గంటపాటు వాడీవేడిగా చర్చించింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని పఠించాలా? వద్దా? అనే అంశంపై శనివారం ఆసక్తికరమైన వాదనలు కొనసాగాయి. ఆలయ కోశాధికార నిర్వహణ విషయమై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. ప్రముఖ లాయర్ కేకే వేణుగోపాల్ ఆలయ ధర్మకర్త అయిన ట్రావెన్కోర్ రాజవంశం తరఫున వాదిస్తుండగా.. అమికస్ క్యూరీగా గోపాల్ సుబ్రహ్మణ్యం కోర్టుకు సహకరిస్తున్నారు. గోపాల్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం అనంతపద్మనాభస్వామి ఆలయంలో పఠిస్తున్న సుప్రభాత శ్లోకాన్ని కొనసాగించాలని, ఈ శ్లోకంలో పలుచోట్ల పద్మనాభస్వామి గురించి ప్రస్తావన ఉందని పేర్కొన్నారు. దీనితో విభేదించిన కేకే వేణుగోపాల్.. విష్ణుమూర్తి ఉన్నది 'యోగనిద్ర'లో అని, ఆయనను సుప్రభాతం పఠించి నిద్రలేపరాదని తెలిపారు. ఇలా సుప్రభాతం పఠించడం వందల ఏండ్లుగా కొనసాగుతున్న ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాల్లో భాగంకాని ఆచారాలను ప్రవేశపెట్టడం దురదృష్టకరమని, దీని ప్రభావం ఆలయ నిర్వహణ కమిటీపై పడే అవకాశముందని చెప్పారు. ఆయన వాదనలను గోపాల్ సుబ్రహ్మణం వ్యతిరేకించారు. వేంకటేశ్వర సుప్రభాతంలో పద్మనాభస్వామి ప్రస్తావన కూడా ఉందంటూ అందులోని కొన్ని పంక్తులను చదివి వినిపించారు. అయితే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరుడి కోసమే సుప్రభాతాన్నిపఠిస్తారని, తిరుమలలో వేంకన్న విగ్రహం నిలబడి ఉండగా, పద్మనాభస్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం పడుకొనే భంగిమలో ఉందని కేకే వేణుగోపాల్ చెప్పారు. ఈ వాదనలు ఆసాంతం విన్న జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం 'దేవుడిని ఎలా మేలుకొల్పుతారు, ఇందుకు ఏ పాటను పాడుతారు అన్నది విశ్వాసానికి సంబంధించిన అంశం. ఈ అంశంలో మేం జోక్యం చేసుకోదలుచుకోలేదు. దీనిని ఆలయ ప్రధాన పూజారి నిర్ణయించనివ్వండి' అని పేర్కొంది. కేరళలోని ఈ ఆలయ నిర్వహణను ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తున్నది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయంలోని నేలమాళిగాలను తెరువగా భారీగా సంపద వెలుగులోకి వచ్చింది. రహస్యమైన తొమ్మిదో నేలమాళిగను మాత్రం ఇంకా తెరువలేదు. -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు? ఆ జీవుడికి ఏయే గతులు కలుగుతాయి... తదితర సందేహాలు కలిగాయట. వాటన్నింటికీ విష్ణువే సమాధానాలు చెప్పి, గరుడుని సందేహ నివృత్తి చేశాడట. గరుడుని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణం అని పేరొచ్చింది. దీనిలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటి... పూర్వఖండం, రెండు... ఉత్తర ఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదుల ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగధర్మాలు, విష్ణువు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తర ఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు... వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే! ద్వితీయాధ్యాయాన్ని ఎవరైనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ప్రతిమనిషికి భయం ఉండాలి. అది దైవభీతి కావచ్చు, పాపభీతి కావచ్చు... ఏదైనా. ఆ భయం లేకుంటే మనిషికి, మృగానికి భేదం లేకుండా పోతుంది. అందుకే ఋషులు ఎంతో ముందుచూపుతో పురాణాలను రచించి మానవజాతికి అందించారు. ఈ పురాణాలన్నింటిలోనూ అది చేస్తే పాపం, ఇది చేస్తే పాపం అని భయపెడుతున్నట్లే ఉంటుంది. దాంతో వాటిని పక్కన పడేస్తాం. వాస్తవానికి మనిషిని సద్వర్తనలోకి నడిపించాలంటే భయం కూడా అవసరమే. అందుకే మన పెద్దలు అంతగా భయపెట్టారు. గరుడ పురాణంలో అన్నీ ఇలాంటి విషయాలే ఉంటాయి. మనిషి మనిషిగా బతకాలంటే గరుడ పురాణం చదవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఇవిచేయకూడదా..? కొన్ని విషయాలను పాపాలని గరుడపురాణం చెబుతోంది. అవి... బ్రహ్మహత్య, శిశుహత్య, గో హత్య, స్త్రీ హత్యలతోబాటు గర్భపాతం చేసేవారు, రహస్యంగా పాపపు పని చేసేవారు, గురువులు, పండితులు, దేవతలు, స్త్రీ, శిశు ధనం హరించేవారు కూడా నరకంలో శిక్షలను అనుభవించక తప్పదంటుంది. అలాగే అప్పు తీర్చనివారు, పర ద్రవ్యాన్ని అపహరించేవారు, విశ్వాస ఘాతకులు, ఇతరులను హత్యచేసే వారు, దోషులను పొగిడేవారు, మంచివారిని నిందించేవారు, ఋణగ్రస్థులను ఎగతాళి చేసేవారు, సత్పురుషులతో స్నేహం చేయనివారు కూడా పాపులేనట. పుణ్యతీర్థాలను, సజ్జనులను, సత్కర్ములను, గురువులను, దేవతలను నిందించేవారు యమలోకంలో దక్షిణపు మార్గాన నడవాల్సి ఉంటుందట. పురాణాలను, వేదాలను, మీమాంస, న్యాయశాస్త్రాలను, వేదాంత శాస్త్రాలను దూషించేవారు, ఇతరులు సంతోషంగా ఉంటే దుఃఖించేవారు, ఎదుటివారు దుఃఖిస్తుంటే ఆనందించేవారు, చెడుమాటలు పలికేవారు కూడా దుర్గతుల పాలు కాక తప్పదు. పెద్దల హితోపదేశాన్ని వినని వారు, ఆత్మస్తుతి, పరనింద చేసేవారు, అధర్మ మార్గంలో నడిచేవారు ఒకరకానికి చెందిన వారైతే ఇంకా నీచమైన పనులు చేసేవారు మరికొందరున్నారు. అంటే... తల్లిదండ్రులను, గురువును, ఆచార్యులను అవమానించేవారు, భార్యను అకారణంగా ద్వేషించి విడిచిపెట్టేవారు, ఏదైనా ఇస్తానని మాట తప్పినవారు, ఇచ్చినదానిని తిరిగి తీసుకునేవారు, దానం ఇచ్చి, బాధపడేవారు వైతరణిని దాటక తప్పదు. దానం చేసేవారిని ఇవ్వవద్దని ఆపేవారు, యజ్ఞవిధ్వంసకులు, హరికథకులకు విఘ్నం కలిగించేవారు, పరుల భూముల సరిహద్దులను చెరిపి భూమిని ఆక్రమించేవారు, పశువులకి మేత లేకుండా చేసేవారు, పశుహత్య చేసేవారు... యమలోకంలో దక్షిణమార్గాన ఉన్న వైతరణిలో కూలబడవలసిందేనట. యమధర్మరాజు ఆజ్ఞను పాటించి యమభటులు పాపాత్ములను వైతరణిలో తోసి వేస్తారట. అబద్ధపు సాక్ష్యం చెప్పేవారు, వంచన చేసి ధనం సంపాదించేవారు, దొంగతనం చేసేవారు, పచ్చని చెట్టను నరికేవారు, ఫలవృక్షాలను పూలతోటలను ధ్వంసం చేసేవారు, తీర్థయాత్రలను చేసేవారికి ఆటంకం కలిగించేవారు, వితంతువులను మోసం చేసి మానహరణ చేసేవారు వైతరణిలో దుఃఖాన్ని అనుభవించి ఒడ్డున ఉన్న బూరుగచెట్టుకు కట్టబడి యమభటుల చేతి దెబ్బలు తింటూ ఉంటారని గరుడపురాణం చెప్తుంది. అంటే గరుడపురాణం మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే... బలహీన మనస్కులు దీనిని చదవడం వల్ల చలించి పోతారని, అందువల్ల ఎప్పుడైనా మృతి సంభవించిన సమయంలో మాత్రమే గరుడపురాణాన్ని చదవాలని పెద్దలు చెప్పారు. కానీ, గరుడపురాణం ఇంటిలో ఉండటం కూడా మంచిది కాదని జరిగే ప్రచారాలలో ఏమాత్రం యథార్థం లేదని పండితులు చెబుతున్నారు. - డి.వి.ఆర్. భాస్కర్ -
కొత్త ఇంట్లోకి వెళ్లగానే పాలెందుకు పొంగిస్తారు?
ఈ ప్రపంచాన్ని సృష్టించాలని ఆది పరాశక్తి నిర్ణయించుకుంది. తర్వాత త్రిమూర్తులను పిలిచి... బ్రహ్మకు సృష్టికార్యాన్ని, విష్ణువుకు స్థితి కార్యాన్ని, శివుడికి లయ కార్యాన్నీ అప్పగించింది. తను మాత్రం సృష్టిలోనే ఉత్తమ సృష్టి అయిన మానవులకు పరిపుష్టిని కలిగించేందుకుగాను గోమాత రూపంలో భూమికి దిగి వచ్చింది. అందువల్ల గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమాత నుంచి వచ్చే పాలు, మూత్రం, పేడ అన్నీ పవిత్రమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పాలు స్వచ్ఛతకు, అభివృద్ధికి చిహ్నం. అందుకే అవి పొంగిన ఇంట్లో అష్టయిశ్వర్యాలు, సుఖసౌఖ్యాలూ పొంగి పొర్లుతాయని అంటారు. కాబట్టే కొత్త ఇంట్లో పాలు తప్పక పొంగిస్తారు