గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు! | Gurmeet Ram Rahim spent personal time with Honeypreet | Sakshi
Sakshi News home page

గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!

Published Mon, Sep 18 2017 9:19 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!

గుర్మీత్, ఆమె ఏకాంతంగా గడిపేవారు!

సాక్షి, చండీగఢ్: అత్యాచారం కేసులో గుర్మీత్‌ సింగ్‌ను దోషిగా కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో డేరా చీఫ్ దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్, డేరా ప్రతినిధి ఆదిత్య ఇన్సాన్‌ కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అయితే హనీప్రీత్, గుర్మీత్‌ల సంబంధం గురించి షాకింగ్ విషయం తాజాగా వెలుగుచూసింది.  గుర్మీత్, హనీప్రీత్ ఎప్పుడూ కలిసే ఉండేవారని డేరాలోని ఓ సాధ్వి చెప్పారు. డేరాలో ఉన్నప్పుడే కాదు, బయటకు వెళ్లినప్పుడు కూడా ఒకే రూములో ఏకాంతంగా గడిపేవారని ఆమె తెలిపారు.

గుర్మీత్ తర్వాత డేరా చీఫ్‌గా బాధ్యతలు చేపడుతుందని అందరూ భావిస్తున్న హనీప్రీత్‌ తన అందం గురించి దిగులు చెందేదట. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ మీడియాకు తెలిపారు. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు పిచ్చి అభిమాని అని.. అందుకు కత్రినాలా అందంగా తయారవ్వాలన్న ఆశే కారణమని వెల్లడించారు. 'నటి కత్రినాలా తను కూడా చాలా అందంగా తయారవ్వాలనుకున్న హనీప్రీత్ ఎంతో శ్రమించి వర్కవుట్లు చేసేవారు. గ్లామర్ డాల్‌గా మారిపోవాలన్నది ఆమె చిరకాల కోరిక.

అందుకే వర్కవుట్లు చేస్తూ ఆలసట చెందినట్లు అనిపిస్తే చాలు.. దూమ్ 3 మూవీలోని కత్రినా పాటకు హుషారుగా స్టెప్పులేస్తూ ఆలసటను, శ్రమను మర్చిపోయేది. గుర్మీత్ కూడా తన వద్దే అదే జిమ్‌లో కసరత్తులు చేసేవాడు. కత్రినాలా తాను నాజుకూగా మారేందుకు ప్రతిరోజు మూడు గంటల పాటు జిమ్‌లో వర్కవుట్లు చేయడంతో కఠిన ఆహారపు అలవాట్లను హనీప్రీత్ ఫాలో అయ్యేదంటూ' ఆమె వ్యక్తిగత జిమ్ ట్రైనర్ వివరించారు.

గత ఆగస్ట్ 25న అత్యాచారాల కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా, అప్పటినుంచి ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పరారీలో ఉంది. మరోవైపు సీబీఐ అధికారులు ఇదివరకే డేరాలో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి పలు కీలక సాక్ష్యాలు సేకరించారు. గుర్మీత్ చేసిన హత్యల కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement