హైదరాబాద్: నకిలీ ధ్రువ పత్రాలతో సిమ్ కార్డులు జారీ చేసే షాపులపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్, జగదీష్ మార్కెట్, బోయిన్‌పల్లి సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అబిడ్స్ షాపుల్లో సోదాలు చేపట్టారు. ఇటీవల నగరంలో సంచలం రేపిన అభయ్ హత్య కేసులో నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు పొందినట్టు విచారణలో తేలడంతో పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.