jagdish market
-
జగదీష్ మార్కెట్ లో పోలీసుల దాడులు
హైదరాబాద్: నకిలీ ధ్రువ పత్రాలతో సిమ్ కార్డులు జారీ చేసే షాపులపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సోమవారం అబిడ్స్, జగదీష్ మార్కెట్, బోయిన్పల్లి సహా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అబిడ్స్ షాపుల్లో సోదాలు చేపట్టారు. ఇటీవల నగరంలో సంచలం రేపిన అభయ్ హత్య కేసులో నిందితులు నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు పొందినట్టు విచారణలో తేలడంతో పోలీసులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జగదీశ్ మార్కెట్లో కార్డన్‌సెర్చ్
-
జగదీశ్ మార్కెట్లో కార్డన్‌సెర్చ్
హైదరాబాద్ సిటీ: అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్లో పోలీసులు బుధవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొని అణువణువు జల్లెడ పట్టారు. రూ.లక్ష నగదుతో పాటు 57 బైక్‌లను, సుమారు 200 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.