
ఈ-వీసాతో వస్తే సిమ్ కార్డు కానుక
న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యటనకు ఈ-టూరిస్ట్ వీసాతో వచ్చే విదేశీయులకు మొబైల్ సిమ్ కార్డులు కానుకగా ఇవ్వాలన్న పర్యాటకశాఖ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ గురువారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ-వీసాతో వచ్చే విదేశీ పర్యాటకులకు సిమ్ కార్డు, దేశంలోని పర్యాటక ప్రాంతాల వివరాలతో కూడిన మ్యాపు, సీడీలతో గిఫ్ట్ కిట్‌ను అందించాలని ప్రతిపాదించింది.