సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు.
⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు.
⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్‌లోనూ ఓ ముఠా పని చేస్తోంది.
⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్‌నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్‌వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది.
⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్
⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్‌వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు.
⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్‌లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు.
⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్‌నెట్ బ్యాకింగ్‌లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్‌లో సిద్ధంగా ఉంటుంది.
నెట్ బ్యాంకింగ్‌లో పాస్‌వర్డ్ మార్చి..
⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్‌వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్‌ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్‌వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు.
⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్‌కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్
(ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు.
⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు.
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
Published Fri, Jan 22 2021 12:28 PM | Last Updated on Fri, Jan 22 2021 4:12 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment