
SIM Cards Rules: భారత ప్రభుత్వం సిమ్ కార్డుల విషయంలో చాలా కఠినమైన నిబంధలనలను ప్రవేశపెట్టడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే 2023 అక్టోబర్ 01 నుంచి కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దుకాణాలకు కఠినమైన నియమాలు..
సిమ్ కార్డులను విక్రయించే దుకాణాలు మునుపటి కంటే కూడా రానున్న రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి టెలికామ్ ఆపరేటర్లు రిజిస్టర్డ్ డీలర్‌ల ద్వారా మాత్రమే సిమ్ కార్డులను విక్రయించాయి. దీనికి వ్యతిరేఖంగా ప్రవర్తిస్తే వారికి రూ. 10 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
కంపెనీల బాధ్యత..
ఎయిర్‌టెల్, జియో వంటి పెద్ద టెలికామ్ కంపెనీలు తప్పకుండా తమ సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలను తనిఖీ చేయాలి. అంతే కాకుండా దుకాణాలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలి.
పోలీసు తనిఖీలు..
పటిష్టమైన భద్రతలను అమలుపరచడానికి పోలీసులు కూడా దీనిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అస్సాం, కాశ్మీర్ వంటి కొన్ని ప్రదేశాలలో కొత్త సిమ్ కార్డ్‌లను విక్రయించే దుకాణాలపై పోలీసు తనిఖీ చేసే అవకాశం ఉంటుంది. కావున విక్రయదారులు ఖచ్చితంగా నియమాలను అనుసరించాలి.
ధృవీకరణ..
వినియోగదారులు కొత్త సిమ్ కార్డుని కొనుగోలు చేయాలన్నా.. లేదా పాతది పోయినప్పుడు & పనిచేయనప్పుడు ఖచ్చితంగా వివరణాత్మక ధృవీకరణ అందించాల్సి ఉంది. ఈ ప్రక్రియ సరైన వ్యక్తులకు మాత్రమే సిమ్ కార్డ్ యాక్సెస్ ఉందని నిర్థారిస్తుంది. కొత్త రూల్స్ సిమ్ కార్డులను సురక్షితం చేయడంలో ఉపయోగపడతాయి. అంతే కాకుండా మోసగాళ్ల భారీ నుంచి కూడా కాపాడంలో సహాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment