ఒకే పేరుతో అనేక సిమ్ కార్డులను తీసుకోవడం వల్ల ఇప్పుడు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. టెలికామ్ చట్టంలో పేర్కొన్నదానికంటే కూడా ఎక్కువ సిమ్ కార్డులను తీసుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పదేపదే నిబంధనను ఉల్లంఘిస్తే జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవచ్చు. ఒక పేరు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయని ఎలా తెలుసుకోవాలి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఒక వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులను తీసుకోవాలి అనే అంశం, వారు ఎక్కడ సిమ్ కార్డు తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా ఒక వ్యక్తి తొమ్మిది సిమ్ కార్డులను తీసుకోవచ్చు. అయితే జమ్మూ & కాశ్మీర్, అస్సాం, ఈశాన్య లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియాలలో అయితే ఒక వ్యక్తి ఆరు సిమ్ కార్డులను మాత్రమే తీసుకోవాలి. కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను అమలులోకి తెచ్చింది.
కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ఈ నిబంధనలను ఉల్లంఘించి.. నిర్ణయించిన సంఖ్యకంటే ఎక్కువ సిమ్ కార్డులను కలిగి ఉంటే వారికి జరిమానా విధించే అవకాశం ఉంది. ఆ తరువాత మళ్ళీ ఈ రూల్ అతిక్రమిస్తే మొదటిసారి నేరానికి రూ. 50000 వరకు జరిమానా విధిస్తారు. ఆ తరువాత మళ్ళీ రిపీట్ అయితే.. రూ. 2 లక్షల జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంది.
కొత్త టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారం.. మోసం, చీటింగ్ చేయడానికి సిమ్ కార్డ్‌లను ఉపయోగిస్తే, అటువంటి వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 50000 జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ పడే అవకాశం ఉంది. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రభుత్వం 'సంచార్ సాథీ' అనే ప్రత్యేక పోర్టల్‌ని ప్రవేశపెట్టింది. ఇందులో మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు రిజిస్టర్ అయ్యాయో చాలా సులభంగా చెక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment