న్యూఢిల్లీ: సిమ్ కార్డు కనెక్షన్లు ఒక్కరి పేరుతో 9కి మించి ఉంటే మళ్లీ ధ్రువీకరించాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్లను టెలికం శాఖ ఆదేశించింది. ధ్రువీకరణ లేకపోతే కనెక్షన్లను తొలగించాలని కోరింది. జమ్మూ అండ్ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, అసోమ్‌లకు ఈ పరిమితి 6 సిమ్‌కార్లులుగా పేర్కొంది. తమకున్న కనెక్షన్లలో వేటిని యాక్టివ్‌గా ఉంచుకోవాలి, వేటిని డీయాక్టివేట్ చేయాలన్నది చందాదారులకు ఆప్షన్ ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది.
టెలికం శాఖ డేటా విశ్లేషణ చేసిన సమయంలో వ్యక్తిగత చందాదారులు 9కంటే ఎక్కువ కనెక్షన్లను కలిగి ఉన్నట్టు గుర్తిస్తే.. వాటిని తిరిగి ధ్రువీకరించేందుకు ఫ్లాగ్ చేయనున్నట్టు టెలికం శాఖ తెలిపింది. ఇటువంటి కనెక్షన్లకు అవుట్‌గోయింగ్ సదుపాయాన్ని 30 రోజుల్లోపు నిలిపివేయాలని, ఇన్‌కమింగ్ కాల్స్ సదుపాయాని 45 రోజుల్లోపు తొలగించాలని ఆదేశించింది. ఆర్థిక నేరాలు, ఇబ్బంది పెట్టే కాల్స్, మోసపూరిత చర్యలకు చెక్ పెట్టేందుకే టెలికం శాఖ తాజా ఆదేశాలు తీసుకొచ్చింది.
SIM Cards: పరిమితికి మించి సిమ్ కార్డులు తీసుకుంటున్నారా..! అయితే..
Published Thu, Dec 9 2021 1:29 AM | Last Updated on Thu, Dec 9 2021 3:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment