నకిలీ ఏటీఎం కార్డులతో రూ.50 కోట్ల లూటీ | 9 arrested for using fake ATM cards to withdraw money from ATMs | Sakshi
Sakshi News home page

నకిలీ ఏటీఎం కార్డులతో రూ.50 కోట్ల లూటీ

Published Sat, Aug 17 2013 4:27 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

9 arrested for using fake ATM cards to withdraw money from ATMs

మల్కన్‌గిరి (ఒడిశా) న్యూస్‌లైన్ : నకిలీ ఏటీఎం కార్డుల సాయంతో ఏటీఎంలను కొల్లగొడుతున్న 9 మంది సభ్యుల దొంగల ముఠాను ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రెండు లాప్‌టాప్‌లు, మూడు డేటా కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లు, 50 సిమ్‌కార్డులు, వివిధ బ్యాంకుల పేరుతో ఉన్న నకిలీ ఏటీఎం కార్డులు, చెక్ బుక్‌లు, పాస్‌పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారుకాగా వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఈ ముఠా సభ్యులు 2006 నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి, గజపతి, కోరాపుట్, కేంద్రపడా, కటక్, బాలసోర్, రాయగడ, నబరంగపుర్ ప్రాంతాలతోపాటు ఢిల్లీ, బరోడాలలోని ఏటీఎంల నుంచి సుమారు రూ.50 కోట్లను స్వాహా చేసినట్లు మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ అఖిలేశ్‌సింగ్ శుక్రవారం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement