
ఆ సిమ్‌లను జియో బ్లాక్ చేస్తుందట!
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ధృవీకరించని రిలయన్స్ జియో కార్డులను బ్లాక్ చేసేందుకు జియోసిద్ధమవుతోంది. మీడియా నివేదికలు ప్రకారం త్వరలోనే అనేక నాన్ వెరిఫైడ్ సిమ్ కార్డులను నిషేధించనుందని తెలుస్తోంది.
జియో సిమ్ కార్డు యూజర్లకు అందించే సమయంలో ఆధార్ కార్డు ను సబ్మిట్ చేసినప్పటికీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా నాన్ వెరిఫికేషన్ సిమ్‌లను బ్లాక్ చేయనుంది. అలాగే ఇ-కేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్‌ఎంఎస్‌ల ద్వారా హెచ్చరిస్తుంది. లేదంటే ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్ ద్వారా 1977 నెంబర్ కాల్ చేసిన టెలీ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
అయితే లోకల్ అధార్ కార్డుతో జియో సిమ్ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్ లోకల్ ఆధార్ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్‌ను ఎంచుకోవాల్సిందే. జియో ఇప్పటికే ఈ స్క్రూట్నీ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు కొంతమంది యూజర్లకు ఈ మేరకు ఎస్‌ఎంఎస్‌లను పంపిస్తోంది.