ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారింది. టెక్ మార్కెట్‌లో ప్రత్యర్ధుల్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. విడుదల చేసే ప్రతి గాడ్జెట్‌లో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే..మార్కెట్‌ను శాసిస్తుంది. తాజాగా యాపిల్ ఐఫోన్15 సిరీస్‌లో సిమ్ స్లాట్ లేకుండా ఈ-సిమ్(ఎలక్ట్రానిక్ సిమ్)తో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు టెక్ బ్లాగ్‌లు కథనాల్ని ప్రచురించాయి.
యాపిల్ ఐఫోన్ 13సిరీస్ విడుదల నేపథ్యంలో ఐఓఎస్‌ను అప్ డేట్ చేసింది. త్వరలో విడుదల చేయబోయే ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లలో నాచ్ డిస్‌ప్లే కాకుండా సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ సెన్సార్‌లతో హోల్ పంచ్ డిస్‌ప్లేతో పరిచయం చేయనుంది. ఇక వాటికంటే భిన్నంగా ఐఫోన్ 15 సిరీస్ ఫోన్‌ను సిమ్ స్లాట్ లేకుండా విడుదల చేయనున్నట్లు టెక్ బ్లాగ్‌లు కథనాల్లో పేర్కొన్నాయి.
జీఎస్‌ఎం అరీనా కథనం ప్రకారం..2023లో విడుదల కానున్న ఐఫోన్ 15 సిరీస్ నుంచి ఫోన్‌లలో ఫిజకల్ సిమ్ ఉండదని, ఇకపై యాపిల్ విడుదల చేయబోయే ఐఫోన్ సిరీస్‌లన్నీ ఈ-సిమ్‌తో వస్తాయని తెలిపింది. మరికొన్ని నివేదికలు..ఐఫోన్‌లు డ్యూయల్ ఈ-సిమ్ సపోర్ట్‌తో వస్తాయని, యూజర్లు ఏకకాలంలో రెండు ఈ-సిమ్‌లను వినియోగించుకునే సౌకర్యం ఉన్నట్లు పేర్కొన్నాయి. అయినప్పటికీ, నాన్-ప్రో మోడల్‌లలో పూర్తిగా ఈ-సిమ్ స్లాట్‌లు ఉంటాయా లేదా ఫిజికల్‌గా సిమ్ కార్డ్‌లను కొనసాగిస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా యాపిల్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా ఐఫోన్‌ను లాంఛ్ చేసినప్పటికీ, ఈ-సిమ్‌లను ఉపయోగించలేని దేశాల్లో ఫిజికల్ సిమ్ స్లాట్ వెర్షన్‌ను అందించే అవకాశం ఉంది.
ఈ-సిమ్ అంటే ఏమిటి?
ఈ-సిమ్ అనేది ఎలక్ట్రానిక్ సిమ్ కార్డ్. ప్రస్తుతం మనం ఫోన్‌లలో వినియోగించే ప్లాస్టిక్ సిమ్ కార్డ్‌లా కాకుండా చిప్ తరహాలో ఉంటుంది. ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లలో స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. వాటిలో ఈ-సిమ్‌ను ఇన్‌సర్ట్ చేయడం చాలా సులభం. అందుకే టెక్ కంపెనీలు ఈ-సిమ్‌ను వినియోగించేందుకు సుమఖత వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యాపిల్ సైతం ఐఫోన్ 15లో ఈ ఈ-సిమ్‌ను ఇన్‌సర్ట్ చేయనుంది.
చదవండి: షిప్‌మెంట్‌లో దుమ్ము లేపుతుంది, షావోమీకి షాకిచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment