ముగ్గురిని కాటేసిన కరెంట్ | 3 People Died due to Current Shock in Sarurnagar | Sakshi
Sakshi News home page

ముగ్గురిని కాటేసిన కరెంట్

Published Sun, Jun 22 2014 12:29 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

ముగ్గురిని కాటేసిన కరెంట్ - Sakshi

ముగ్గురిని కాటేసిన కరెంట్

 సరూర్‌నగర్  :కరెంట్ ముగ్గురిని బలిగొంది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలు.. తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత నిద్దామనే ఉద్దేశంతో సెంట్రింగ్ పనికి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి ప్రాణాన్ని కరెంట్ బలిగొంది. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...దేవరకొండ మండలం కంబాలపల్లి పక్కనున్న రేకులారం గ్రామానికి చెందిన కూర ముత్తయ్య, ఈదమ్మ దంపతులు బడంగ్‌పేటలో నివాసం ఉంటున్నారు. వీరి మూడో కుమారుడు వెంకటేష్ (19) మీర్‌పేటలోని టీకేఆర్ కాలేజీలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబానికి ఆసరాగా ఉండేదుకు సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు.
 
 బడంగ్‌పేటలోని గాయత్రి హిల్స్ కాలనీలో భవన నిర్మాణం కోసం ఓ బిల్డర్ గోతులు తీయించాడు. వాటిలో పిల్లర్లు వేసేందుకు శనివారం ఇనుప చువ్వలను క టింగ్ చేస్తున్నారు. విద్యుత్ తీగలకు నేరుగా కొండీలు తగిలించి కటింగ్ మిషీన్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. చువ్వలను కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వాటికి విద్యుత్ సరఫరా కావడంతో వెంకటేష్ విద్యాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఘటనా స్థలానికి వచ్చి రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పలు సంఘాల నాయకులు వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని బిల్డర్‌ను డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
 బద్యాతండాలో..
 పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసం బద్యాతండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...తండాకు చెందిన భానోతు బీల్‌సింగ్(45) రాత్రి స్నానం చేసి దండెంపై వేసిన దుస్తులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రేకుల కింద వేసిన ఇనుప పైపు నుంచి దండానికి కట్టిన వైరుకు విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచె ందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
 
 కట్టంగూర్ (ఇస్మాయిల్‌పల్లి) :
 విద్యుదాఘతంతో రైతుమృతిచెందిన సంఘటన మండలంలోని పిట్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఇస్మాయిల్‌పల్లిలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యు లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన రైతు అలుగుబెల్లి లక్ష్మారెడ్డి (40) ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెల్లి మోటార్ ఆన్ చేయడంతో ట్రాన్స్‌ఫార్మర్ ట్రిప్ అయ్యింది. దీంతో రైతు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈఘటన చోటు చేసుకుందని రైతులు ఆరోపిస్తూ కట్టంగూర్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న నల్లగొండ రోడ్డుపై మృతదేహంతో  రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకోవటంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ అధికారులు ఎవరు స్పందించలేదు.

దీంతో పోలీసుల ట్రాన్స్‌కో సిబ్బ ం ది తో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యా యం చేసే విధంగా చర్యలు తీసుకుంటామ ని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ పర్వతాలు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు కలరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement