24 గంటల వ్యవధిలో విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి
కాకినాడ జిల్లాలో విషాదం
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్‌ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్‌వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్‌ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్‌కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment