రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు వ్యతిరేకంగా ఊరూరా సమైక్య ఉద్యమాలటకు ఊపిరి పోస్తోంది. విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని నింపుతోంది. జిల్లాలో బుధవారం కూడా వైఎస్‌ఆర్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగాయి. ప్రజలను ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ నాయకులు సమైక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు.
బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. ఆ పార్టీ నాయకులు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండలాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి సమైక్య నినాదాలు చేశారు. బొబ్బిలిలో దక్షిణి దేవిడి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బొబ్బిలి గ్రామంలోని ఒకటి, రెండు, మూడు వార్డులకు చెందిన సుమారు వంద మంది వరకూ దీక్షల్లో కూర్చున్నారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం కట్టుబడి ఉండే పార్టీకి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. సమైక్యాంధ్ర ముసుగులో ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
దీక్షలో ఆ వార్డులకు చెందిన కూరాకుల సంఘ ఉత్తరాంధ్ర నాయకుడు కోట పెదరాములు, మాజీ కౌన్సిలరు కోట అప్పారావు, మింది గుంపస్వామి, తోట కబీరుదాసు, పుప్పాల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆ పార్టీ నాయకుడు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలు జరిగాయి. కొనిశ బంగ్రారాజు, పి.చిన్నప్పన్న, క్రిస్టఫర్ రాజు, కమలమ్మ, వెంకటరెడ్డిలకు విక్రమ్ పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో నామాల సర్వేశ్వరరావు, బుగత ముత్యాలమ్మ, రాంబార్కి సత్యం, సియ్యాదుల శేఖర్, సంతోష్ తదితరులు ఉన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీ సెల్ కన్వినర్ షేక్ రహ్మాన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్షల శిబిరం రెండో రోజూ కొనసాగింది. సీతంపేట గ్రామానికి చెందిన చిప్పాడ సత్యన్నారాయణ, నౌదాసరి అప్పారావు, ఎలమంచిలి సోమునాయుడు, నౌదాసరి నర్సింగరావు, ఎలమంచిలి అప్పారావు, సరిత అప్పారావులు దీక్షల్లో కూర్చున్నారు.
జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్‌తో పాటు మండల కన్వీనర్ ఎస్.సత్యం తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవానీ కూడా లక్కవరపుకోటలో దీక్ష చేపట్టారు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మ క్కువ శ్రీధర్, డాక్టరు పెద్దినాయుడుల ఆధ్వర్యంలో శిబిరాలు జరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రెండో రోజు దీక్షను సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో జనా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో మహిళలు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు పెనుమత్స సురేష్ బాబు వీరికి సంఘీభావం తెలిపారు. అన్ని దీక్షా శిబిరాల వద్ద నాయకులు సమైక్య నినాదాలతో హోరె త్తించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్‌ఆర్ సీపీ మాత్రమే పోరాడుతోందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
‘సమైక్య’ ఉద్యమానికి ఊపిరి
Published Thu, Jan 9 2014 3:22 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement