ఘటనా స్థలం వద్ద ఎమ్మెల్యే కాటసాని
కర్నూలు (న్యూటౌన్)/ఓర్వకల్లు: కర్నూలు నగర శివారులోని రింగ్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో నన్నూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రామచంద్రయ్య (50), జానకమ్మ (45) స్పృహ కోల్పోయారు. భార్యభర్తలు వ్యక్తిగత పనినిమిత్తం ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయలుదేరారు. టోల్‌గేట్ సమీపంలోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద కర్నూలు వైపునకు మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది.
అదే రహదారిలో పాణ్యం వెళ్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగి అంబులెన్స్‌లో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఓర్వకల్లు వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌ను దాటుకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ వినోద్ కామెడ్ కాలు కేబిన్‌లో ఇరుక్కపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో జేసీబీ ద్వారా బయటకు తీశారు. హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment