‘నంద్యాలలో ప్రభుత్వం బీసీలను టార్గెట్‌ చేసింది’ | government has targeted BCs in nandyal, says ysrcp leader BY ramaiah | Sakshi
Sakshi News home page

‘కేశవరెడ్డి కేసు మాఫీ కోసమే పార్టీ మారింది’

Published Mon, Jul 17 2017 2:27 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

‘నంద్యాలలో ప్రభుత్వం బీసీలను టార్గెట్‌ చేసింది’ - Sakshi

‘నంద్యాలలో ప్రభుత్వం బీసీలను టార్గెట్‌ చేసింది’

కర్నూలు: నంద్యాలలో ప్రభుత్వం బీసీలను  టార్గెట్‌ చేసిందని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఆరోపించారు. బీసీ కౌన్సిలర్‌పై పోలీసుల దాడిని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఖండించకపోగా, పైగా పోలీసులయ దాడిని సమర్థించడం దారుణమన్నారు. అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నంద్యాలలో పడుకున్నా ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జీవోలన్నీ చిత్తు కాగితాలుగా మారతాయని, నంద్యాలను సీడ్‌ క్యాపిటల్‌గా చేస్తామన్న హామీ ఏమైందని బీవై రామయ్య సోమవారమిక్కడ సూటిగా ప్రశ్నించారు.

ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీలో అవినీతి కంపు కొడుతోందన్నారు. ఎక్కువ ధరతో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇళ్ల నిర్మాణంలోను అదే పరిస్థితి అని, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని బీవై రామయ్య డిమాండ్‌ చేశారు.  కేశవరెడ్డి కేసు మాఫీ కోసమే ఆదినారాయణరెడ్డి పార్టీ మారారని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement