సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిననాటినుంచి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వ్యక్తి ఆయన అని మండిపడ్డారు.
చంద్రబాబు తన ఆదాయం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రైతులు బాగుడాలంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎలా తన్ని తరిమేశారో అదే రీతిలో.. రానున్న ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment