చిత్రంలో ఎమ్మెల్యే ఐజయ్య, హఫీజ్‌ఖాన్ తదితరులు వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీజే షాపింగ్ మాల్‌లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. పేరుకే టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..బడుగుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చరిత్రాత్మకమన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని సాహసాన్ని జననేత చేశారని కొనియాడారు. బీసీ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా బడుగు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయన్నారు.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బీసీలు రాజకీయంగా బలపడేందుకు నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతాయని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు. జనంలో చంద్రబాబుపై నమ్మకం పోయిందని, రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. బీసీల పునాది మీద ఏర్పడిన పార్టీగా చెప్పుకోవడమే తప్ప టీడీపీ..బడుగుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. బీసీల అభవృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాగరాజు యాదవ్, సత్యం యాదవ్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి, రాష్ట్ర కార్యదర్శి రియల్‌టైం నాగరాజు, ఆదిమోహన్‌రెడ్డి, రఘునాథ్, రాజశేఖర్, కటారి సురేశ్, కరుణాకర్‌రెడ్డి, రైల్వేప్రసాద్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, హనుమంతురెడ్డి, రంగ, కిశోర్, విఠల్, మున్నా, సయ్యద్ ఆసిఫ్, మదారపు రేణుకమ్మ, ఏసన్న, వెంకటేశ్వర్లు తదితరులు
పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment