ప్రసంగిస్తున్న బీవై రామయ్య
ఎమ్మిగనూరు(కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ నేతలు.. నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు, మట్టి, ఇసుక, ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ అవినీతిని అధికారికం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన స్థానిక కుర్ని కల్యాణ మండపంలో శుక్రవారం బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరన్నారు. నిత్యం ప్రజలను మోసగిస్తూ.. అవినీతి, అక్రమాల్లో టీడీపీ అధినేత నంబర్‌వన్‌గా ఉన్నారన్నారు. పోలవరం, పట్టిసీమ అంటూ వేలకోట్ల రూపాయలు స్వయంగా ముఖ్యమంత్రి దోచుకుంటూ ఉంటే..జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గఇన్‌చార్జ్‌లు అందినకాడికి దండుకుంటున్నారని విమర్శించారు.
నాలుగేళ్లలో దేశంలో ఏపీలోనే ఎక్కువ అవినీతి జరిగిందని సర్వేలు తేటతెల్లం చేస్తున్నా.. చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు రంగులేసి తమ ఘనతగా చెప్పుకోవటం బాబుకే చెల్లిందన్నారు. ప్రజల కోసం..ఇచ్చిన మాట కోసం పదవులను త్యాగం చేసి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చంద్రబాబులా దొడ్డిదారిలో ముఖ్యమంత్రి కావాలనుకొంటే 2011లోనే అయ్యేవారని, చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే 2014లోనే సీఎం అయ్యేవారన్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని కుమారుడిని దొడ్డిదారిలో మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుదైతే..ఇచ్చిన మాట కోసం పదవులకు త్యాగం చేసి స్వంతంగా పార్టీ పెట్టి 5లక్షల పైచిలుకు మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన చరిత్ర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు.
అవినీతి సొమ్ముతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నారని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్ల పాత్ర కీలకమని, చంద్రబాబులాంటి మోసగాడిని ఎదుర్కొనేందుకు మరింత జాగ్రత్తగా మెలగాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రుద్రగౌడ్, కనకవీడు లక్ష్మీకాంత్‌రెడ్డి, కేఆర్ రాఘవరెడ్డి, బుట్టారంగయ్య, రియాజ్, రాజారత్నం, భీంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బీఎన్ నాగరాజు, భాస్కర్, సునీల్, గోవిందు, బంద, సయ్యద్‌చాంద్, గౌస్, పాలశ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, షబ్బీర్, యూకేరాజు, నజీర్, నగేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నేతల అవినీతిని ఎండగడదాం: కె. జగన్‌మోహన్‌రెడ్డి
టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ప్రజలకు రక్షణగా నిలవాలని పార్టీ కార్యకర్తలకు, బూత్ కమిటీ కన్వీనర్లకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కె.జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి స్థానికంగా ఉండకుండా ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అన్న క్యాంటీన్ల పేరుతో ఇస్కాన్ సహాయాన్ని కూడా తమ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. పింఛన్లు, ఇళ్లు, సబ్సిడీ రుణాల మంజూరులో టీడీపీ నాయకులు ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మాణల్లోనూ తెలుగుతమ్ముళ్ల అవినీతిని విజిలెన్స్ అధికారులు నిగ్గుతేల్చారన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీ కన్వీర్లదే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment