
వైఎస్సార్‌సీపీ యూఏఈ వింగ్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బీవై రామయ్య
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా వైఎస్సార్ సీపీ యూఏఈ వింగ్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కర్నూలు వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అధ్యక్షులు బీవై రామయ్య హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ నివసిస్తోన్న తెలుగువారు, రామయ్య దృష్టికి గల్ఫ్ సమస్యలను తీసుకెళ్లారు.
వారి సమస్యలను విన్న రామయ్య, పార్టీ అధ్యక్షుల దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న ఉద్యోగులందరూ ముక్తకంఠంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బీవై రామయ్యకు మాట ఇచ్చారు. యూఏఈ కమిటీ కన్వీనర్స్ రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, యాసిన్, కుమార్ చంద్ర, అక్రమ్, కర్ణ, కోటేశ్వర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రమణా రెడ్డి తదీతరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment