వైఎస్సార్‌సీపీ నేత బీవై రామయ్య ( పాత ఫోటో)
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించానికే టీడీపీ నవ నిర్మాణ దీక్షలు చేస్తుందని వైఎస్సార్‌సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడం టీడీపీకి అలవాటైన పని అని విమర్శించారు.
టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. బీవై రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు.వైఎస్పార్‌సీపీ ఎంపీల రాజీనామపై ప్రశ్నించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్ర బాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం వేల కోట్ల రూపాయలు లూటీ చేయడానికే పనికొచ్చిందని విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేశామన్న అభివృద్ధి మేడిపండును తలపిస్తే.. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు గురువింద సామెతను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అతని మంత్రి వర్గం అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment