చేర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. ముఖ మం డపంలో ఉదయం 10 గంటల నుంచి మొత్తం 15 హుండీలను లెక్కించగా 22,90,043 ఆదాయం వచ్చింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన శ్రీసాయి సేవా సమితి సభ్యులు, పోలీసుల బందోబస్తు మధ్య హుండీలను లెక్కించారు. ఆలయ ఈఓ కాటం రాజు, ప్రత్యేక అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో హుండీలను లెక్కించగా నగదు *22,90,043 వచ్చింది. మిశ్రమ బంగారం 45 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 50 గ్రాములు, 650 కిలోల బియ్యంతోపాటు 81 విదేశీ కరెన్సీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 73 రోజు లుగా స్వామివారికి భక్తులు హుండీలలో సమర్పించిన ఆదాయమని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు నీల చంద్రశేఖర్, సుదర్శన్, ఆలయ సిబ్బంది, అర్చ కులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
కోడెల వేలం ఆదాయం *46,400
చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆరు కోడెలకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాటం రాజు తెలిపారు. వేలం పాట ద్వారా *46,400 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.
మల్లన్న హుండీ ఆదాయం 22.90లక్షలు
Published Fri, Sep 13 2013 2:59 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Advertisement