temple hundi
-
దేవుడి హుండీలో పడిపోయిన ఐఫోన్
-
పట్టపగలే హుండీ చోరీ!
మహబూబ్‌నగర్: పట్టపగలే ఆలయంలో హుండీ చోరీకి పాల్పడిన సంఘటన శనివారం వెలుగుచూసింది. ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని పాత కిష్టంపల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో దుండగులు హుండీని పగులగొట్టి రూ.రెండు లక్షలు నగదు, అలాగే వెండి నగలు అపహరించారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి శనివారం ఉదయం ఆలయ పూజారి సోములు వెళ్లాడు. తాళాలు పగులగొట్టి ఉండటంతో హుండీని గమనించాడు. పగిలి ఉండటంతో వెంటనే సర్పంచ్‌తోపాటు ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు. వారు అక్కడికి చేరుకుని పోలీసులకు తెలిపారు. ఎస్ఐ జగన్మోహన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉండటంతో పుటేజీని పరిశీలించారు. ఈ ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, విచారణ చేస్తున్నారు. కారులో వచ్చి... వికారాబాద్‌కు చెందిన అంబిరియా నానవత్ (టీఎస్ 34 టీఎ 0783) కారులో కిష్టంపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఎవరూ లేకపోవడంతో ఆలయంలోకి చొరబడ్డారు. తాళాలు పగులగొట్టిన అనంతరం కారులో ఉన్న మహిళ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి హుండీలోని నగదు తీసుకున్నారు. కారు నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేయగా కారు వికారాబాద్‌కు చెందిన అంబిరియా నానవత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. ఇదే కారుకు జూలై 3న నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్‌లో ఫైన్ వేసినట్లు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. -
షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు
షిర్డీ: ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్‌కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్డౌన్ అంక్షలన్నీ ఎత్తివేసింది. ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు. అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్ కార్డు, ఆన్లైన్ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి. 1.35 లక్షల హెక్టార్లలో పంటనష్టం: ఫడ్నవీస్ నాగ్‌పూర్/చంద్రాపూర్: వరదల కారణంగా నాగ్‌పూర్ డివిజన్లో దాదాపు 1,35,000 హె క్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం తెలిపారు. హింగ్‌ఘాట్, చంద్రాపూర్ జిల్లాల్లో మంగళవారం వర్ష ప్రభావిత గ్రామాలను సందర్శించిన అనంతరం ఫడ్నవీస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగ్‌పూర్ డివిజన్లో ముఖ్యంగా చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం నాగ్‌పూర్ డివిజన్లో వరదలతో 1,35,000 హెక్టార్ల భూమిలో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టాలపై సర్వే జరుగుతోందని, వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నదన్నారు. అలాగే జిల్లాలోని చిమూర్ తహసీల్‌లోని నవేగావ్ (పేథ్)లో పంట నష్టాన్ని కూడా ఫడ్నవీస్ పరిశీలించారు. -
హుండీలను కొల్లగొట్టే ముఠా అరెస్ట్
కడప అర్బన్: జిల్లాలోని పలు దేవాలయాల్లోకి రాత్రివేళ అక్రమంగా ప్రవేశించి హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి తెలిపారు. బుధవారం కడప డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగల ముఠా వివరాలను డీఎస్పీ వెల్లడించారు. ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాలో ఐదుగురు బాలనేరస్థులు ఉన్నారు. వీరు పలు హుండీలలో దొంగిలించిన రూ. 56 వేలల్లో రూ.14,510 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులను దొంగిలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు స్పెషల్ క్రైమ్‌టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కడప నగరం గౌస్‌నగర్‌కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ సలీం(26)తో పాటు ఐదుగురు బాలనేరస్తులు ఉన్నారన్నారు. దొంగతనం చేయాలనుకునే ప్రాంతాలకు బాడుగ ఆటోలలో వెళ్లి దేవాలయాలకు వేసిన తాళాలను ఆయుధాల సహాయంతో పగులగొట్టి అందులో ఉన్న హుండీలను పగులగొట్టి డబ్బులు చోరీ చేసి తమ చెడు అలవాట్లకు ఆ డబ్బును ఉపయోగించుకుంటున్నారన్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కడప, కాశినాయన, సిద్దవటం మండలాల్లోని 10 ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి డబ్బులు దొంగతనం చేశారన్నారు. ఈ దొంగతనాలకు సంబంధించి ఆయా పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రిమ్స్ సీఐ యు. సదాశివయ్య, ఎస్ఐ జె. మోహన్‌కుమార్ గౌడ్‌తో పాటు సిబ్బంది నగరంలోని చలమారెడ్డి పల్లె సర్కిల్ దగ్గర వోల్వో కంపెనీ బిల్డింగ్ పక్కన కంపచెట్ల వద్ద ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి వివిధ ఆలయాల్లోని హుండీల్లో దొంగిలించిన నగదు, ఆలయ తాళాలు, హుండీలను పగులగొట్టేందుకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అందరూ మద్యం సేవించడం, ఇతర చెడు అలవాట్లు కలిగి, ఎలాంటి పనులు చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటారన్నారు. ఐదుగురు బాలనేరస్థులను ప్రభుత్వ బాలుర గృహానికి తరలిస్తామన్నారు. దొంగలను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
దొంగెవరు రాజన్నా..?
సాక్షి, కరీంనగర్ : ఫలానా చోట దొంగతనం చేసినట్లు దొంగ ఒప్పుకుంటున్నా... అబ్బే మా దగ్గర దొంగతనమే జరగలేదని వాదించడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. వేములవాడ రాజన్న దేవాలయంలోని హుండీ నుంచి ఫిరోజ్ అనే వ్యక్తి దొంగిలించిన ఆభరణాల సంచి విషయంలో అధికారులు చెబుతున్న కథలకు... వాస్తవ అంచనాలకు పొంతన కుదరడం లేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి బంగారు, వెండి, రాగి, అల్యూమినియం ఆభరణాలతో కూడిన సంచిని చోరీ చేసినట్లు స్థానికంగా దేవుడికి ఇచ్చిన బియ్యం అమ్ముకొని బతికే ఫిరోజ్ అనే వ్యక్తి చెబుతుండగా... మా దేవాలయం నుంచి ఎలాంటి సంచి చోరీకి గురి కాలేదని సాక్షాత్తూ దేవాలయ అధికారులే స్పష్టం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దేవాలయంలోని హుండీని లెక్కించేటప్పుడే ఆభరణాలతో కూడిన సంచిని పక్కనపెట్టిన ‘ఇంటిదొంగ’ల గుట్టు వెలుగులోకి రాకుండా ‘మా దగ్గర దొంగతనమే జరగలేదు’ అని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీసీటీవీల పర్యవేక్షణలో కూడా హుండీ లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతాయనే విషయం వెలుగులోకి రావచ్చనే ఆందోళన అధికారుల్లో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 23న వేములవాడ హుండీ లెక్కింపు గత అక్టోబర్ 23న దేవాదాయ శాఖ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల మధ్య లెక్కింపు జరిగింది. 600 మంది సభ్యులు గల శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. రూ.1.78 కోట్ల ఆదాయం వేములవాడ దేవస్థానానికి సమకూరింది. ఇందులో 456 గ్రాముల బంగారం, 17.3 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. కాగా సరిగ్గా నెలరోజులకు ఈ నెల 21న హుండీలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ గోల్డ్‌స్మిత్ వద్ద వేములవాడ నుంచి వచ్చిన ఫిరోజ్ అనే వ్యక్తి ఒకసారి 120 గ్రాములు, మరో రెండు సార్లు 30 గ్రాముల చొప్పున ఆభరణాలు విక్రయించినట్లు తేలింది. అరతుల బంగారాన్ని కూడా కరిగించి తన భార్యకు ఆభరణం చేయించాడు. ఈ వెండి, బంగారం, ఇతర ఆభరణాలు గల సంచిని వేములవాడ దేవాలయం నుంచి అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో దొంగిలించినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు వద్ద ఫిరోజ్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కేసును వేములవాడ పోలీసులకు బదిలీ చేశారు. రాజన్న హుండీ సొమ్ము కాదన్న ఈవో కాగా, రాజన్న హుండీలో లెక్కించిన ఆభరణాలకు సంబంధించి కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో తనిఖీ చేస్తే 20 కిలోల బరువైన సంచి లభించింది. ఆ సంచిని బియ్యం సేకరించే క్రమంలో ఓపెన్‌స్లాబ్‌లో ఓ మూలన పడి ఉంటే తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. అందులోని వస్తువులను మూడుసార్లు తిమ్మాపూర్‌లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వేములవాడ సీఐ దేవాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తమ గుడిలో ఎలాంటి దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. 22వ తేదీన మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రాగా, అదేరోజు ఈవో పేరిట రిజాండర్ వచ్చింది. తెల్లకాగితం మీద కార్యనిర్వాహణాధికారి పేరుతో ఎవరి సంతకం లేకుండా వచ్చిన ఈ రిజాయిండర్లో దేవాలయంలో కానుకల చోరీ వార్తకు దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపునకు ఎలాంటి సంబంధం లేదని ఏకవాఖ్య ‘ఖండన’ పంపించారు. వివరాలేవీ అందులో పొందు పరచలేదు. కాగా హుండీ లెక్కింపు సమయంలో నగదు, బంగారం, వెండితోపాటు వెండి పూత రాగి, అల్యూమినియం ఇతర స్క్రాప్‌కు సంబంధించిన లెక్కలు చూసి, అవన్నీ సక్రమంగానే ఉన్నందున దేవాలయం ఆవరణలో చోరీ కాలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలోనే ఇంటి దొంగలే ఓ ఆభరణాల సంచిని బియ్యంతోపాటు పడేశారనే లాజిక్కును అధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే మరిచిపోతున్నారు. అందుబాటులో లేని సీసీటీవీ ఫుటేజ్ సీసీ టీవీ కెమెరాల నిఘాలోనే హుండీ లెక్కింపు జరిగినా... ఇప్పుడు ఆ టీవీల ఫుటేజీ అందుబాటులో లేదు. కేవలం 16 రోజుల బ్యాకప్ మాత్రమే అందుబాటులో ఉండే విధంగా సీసీ కెమెరాలను కంప్యూటర్లకు అనుసంధానం చేయడంతో ఉన్న ఒక్క ఆధారమూ లేకుండా పోయింది. దొరికిన ఆభరణాల సంచి విలువ తక్కువే అయినా... దేవాలయం హుండీ సొమ్ము చోరీకి గురయిన సంఘటన తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఇది తెలిసే ‘ఆ చోరీకి హుండీకి ఏం సంబంధం లేదు’ అని ఆలయ అధికారులు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. విచారణ జరుపుతున్నాం: సీఐ శ్రీధర్ వేములవాడ హుండీ లెక్కించిన ఓపెన్ స్లాబ్ ప్రాంతం నుంచే ఆభరణాల సంచిని ఎత్తుకెళ్లినట్లు ఫిరోజ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో దేవాలయం నుంచి మాకెలాంటి ఫిర్యాదు రాలేదు. కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మేమే సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నాం. ఫిరోజ్‌ను రిమాండ్‌కు తరలించడం జరిగింది.చోరీ వార్తలకు హుండీ ఆభరణాలకు -
హుండీలో సొమ్ము తస్కరించాడు..మళ్లీ వచ్చి దొరికిపోయాడు
పశ్చిమగోదావరి , ద్వారకాతిరుమల : చిన వెంకన్న ఆలయ హుండీలో చేయిపెట్టి సొమ్మును తస్కరించిన వ్యక్తి మరోసారి చోరీ చేసేందుకు శుక్రవారం క్షేత్రానికి వచ్చి దేవస్థానం సిబ్బంది చేతికి చిక్కాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో 10 రోజుల క్రితం శ్రీవారి ఆలయానికి వచ్చి ఓ వ్యక్తి దర్శనానంతరం బయటకు వెళ్లే క్రమంలో ముఖ మండపంలో ఉన్న పెద్ద హుండీలో చేయిపెట్టి నగదును తస్కరించాడు. దీన్ని సీసీ పుటేజీలో పరిశీలించిన ఆలయ అధికారులు, సిబ్బంది అతడ్ని పట్టుకునే లోపే అక్కడి నుంచి జారుకున్నాడు. ఆలయ అధికారులు ద్వారకాతిరుమల పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మళ్లీ అతను ఆలయానికి వచ్చాడు. హుండీలో చేయి పెడుతుండగా ఆలయ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. తీరా చూస్తే 10 రోజుల క్రితం హుండీలో చేయిపెట్టి సీసీ పుటేజీలో రికార్డయింది ఇతడేనని సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడ్ని పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్సై వీర్రాజు విచారణ చేపట్టారు. అతడు చింతలపూడిలోని ఆంథోనినగర్కు చెందిన దుద్దు పవన్‌కుమార్‌గా గుర్తించారు. అతను పాత నేరస్తుడని ఎస్సై చెప్పారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
రాజన్న హుండీలో పాతనోట్ల కట్టలు
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేయడంతో దేవుళ్ల హుండీకీ డిమాండ్ పెరిగింది. చాలామంది భక్తులు రద్దైన రూ. 500, రూ. వెయ్యి నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు. దీంతో అన్నీ ఆలయాల హుండీలు పాత నోట్ల కట్టలతో కళకళలాడుతున్నాయి. తాజాగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ హుండీలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు లక్షల్లో పాత నోట్లను వేశారు. ఓ వ్యక్తి రూ.500, రూ. వెయ్యి నోట్లతో రూ.4.50 లక్షలు, మరో అజ్ఞాత వ్యక్తి పాత రూ.వెయ్యి నోట్లతో లక్ష రూపాయలను హుండీలో వేయడం సంచలనం కలిగించింది. -
మల్లన్న హుండీ ఆదాయం 22.90లక్షలు
చేర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. ముఖ మం డపంలో ఉదయం 10 గంటల నుంచి మొత్తం 15 హుండీలను లెక్కించగా 22,90,043 ఆదాయం వచ్చింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన శ్రీసాయి సేవా సమితి సభ్యులు, పోలీసుల బందోబస్తు మధ్య హుండీలను లెక్కించారు. ఆలయ ఈఓ కాటం రాజు, ప్రత్యేక అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో హుండీలను లెక్కించగా నగదు *22,90,043 వచ్చింది. మిశ్రమ బంగారం 45 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 50 గ్రాములు, 650 కిలోల బియ్యంతోపాటు 81 విదేశీ కరెన్సీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 73 రోజు లుగా స్వామివారికి భక్తులు హుండీలలో సమర్పించిన ఆదాయమని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు నీల చంద్రశేఖర్, సుదర్శన్, ఆలయ సిబ్బంది, అర్చ కులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కోడెల వేలం ఆదాయం *46,400 చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆరు కోడెలకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాటం రాజు తెలిపారు. వేలం పాట ద్వారా *46,400 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.