కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం బుధవారం భక్త జనసంద్రంగా మారింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం బుధవారం భక్త జనసంద్రంగా మారింది. ఉదయం నుంచే భారీగా తరలివచచిన భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానం ఆచరించి తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి బారులు తీరారు. రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన ఆలయ అధికారులు స్వామివారి అర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.