
సాక్షి, కర్నూలు\ పశ్చిమగోదావరి: ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలు కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తుతోంది. ఇన్ ఫ్లో3,70,817 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 25,427 క్యూసెక్కులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 855.60 అడుగులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 93.5810 టీఎంసీలుగా ఉంది.
నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. 24,082 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతుంది. 4,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. ప్రాజెక్ట్ గరిష్ట సామర్థ్యం 590 అడుగులు కాగా, 536 అడుగుల మేర నీరు చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం గోదావరి ఉధృతి మరింత పెరిగింది. కాఫర్ డ్యామ్ వద్ద 33 మీటర్లకు వరదనీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరిలో నీటిమట్టం భారీగా పెరిగింది. 4 లక్షల 62 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment