
సాక్షి, విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో ప్రకటించారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట ఉంటుంది. 22న అర్థమండల దీక్ష, 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నవంబరు 3న తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని ఈవో వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వాహణ ఉంటుందని పేర్కొన్నారు.
ఆలయ ప్రాంగణంలో మాస్క్, వ్యక్తిగత దూరం లాంటి నిబంధనలను భక్తులు పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపు వంటి ప్రక్రియ సైతం నిబంధనల మేరకే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వృద్దులు, చిన్నారులు, గర్బిణీలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించాలన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో గల మూడు రథాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment