sitaramachandraswamy temple
-
కనుల పండువగా ఉత్తర ద్వార దర్శనాలు
భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురి ల్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువ జామునే భక్తులు చేరుకున్నారు. భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు. భద్రాద్రిలో...: భద్రాచలంలో సోమ వారం తెల్లవారుజామున వైకుంఠ ద్వా ర దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు. యాదాద్రిలో... యాదాద్రిలో వేకువజామునే ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చ కులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు చేశారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉదయం 6:48 గంట ల నుంచి 7:30 గంటల వరకు స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో స్వామిని ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో అధ్య యనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్స్య అవతారంలో ఊరేగించారు. యాదాద్రి ప్రధానా లయ ఉద్ఘాటన తర్వాత తొలిసారి జరిగిన ఉత్తర ద్వార దర్శనానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారు లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాగా, యాదా ద్రి కొండకు దిగువనున్న తులసీ కాటేజీలో దాతల సహకారంతో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు. -
భద్రాద్రిలో 26 నుంచి ‘కార్తీక’ పూజలు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 26 నుంచి కార్తీక మాస ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 26 నుంచి 30వ తేదీ వరకు మణవాళ మహాముని తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తారు. 31న విశ్వక్సేన తిరునక్షత్రం, నవంబర్ 1 విశ్వక్సేనుడికి స్నపన తిరుమంజనం, చుట్టు సేవ నిర్వహించనున్నారు. నవంబర్ 5న క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా స్వామివారిని జగన్మోహినిగా అలంకరిస్తారు. 8న చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసేసి, గ్రహణం అనంతరం తెరిచి సంప్రోక్షణ చేస్తారు. ఆ రోజున నిత్యకల్యాణం రద్దు చేస్తారు. తిరిగి 9వ తేదీన సుప్రభాత సేవ తర్వాత దర్శనాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీన కార్తీక మాస శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తారు. 20న సర్వ ఏకాదశి సందర్భంగా లక్ష కుంకుమార్చన, ప్రత్యేక పూజలు, 21న కార్తీక బహుళ ద్వాదశి సందర్భంగా గోదావరి నదీ హారతి ఉంటాయని ఆలయ వైదిక కమిటీ సభ్యులు వెల్లడించారు. -
రామయ్య హుండీ ఆదాయం రూ.2 కోట్లు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం లెక్కించారు. 59 రోజులకు హుండీల ద్వారా రూ.2,00,22,897 ఆదాయం లభించింది. ఈ నగదుతో పాటు 140 గ్రాముల బంగారం, 2.500 కేజీల వెండి వచ్చాయి. 780 అమెరికన్ డాలర్లు, 300 మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 100 రష్యా రూబుల్స్, 30 దీరామ్స్, 101 బూటాన్ కరెన్సీ, ఒక సౌదీ రియాల్ లభించాయి. రెండేళ్ల అనంతరం శ్రీరామనవమి, మహాపట్టాభిషేకం వేడుకలను మిథిలా స్టేడియంలో నిర్వహించడంతో అ«ధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. దీంతో భద్రాద్రి రామయ్యకు రూ.2 కోట్లకు పైగా ఆదాయం లభించిందని ఈవో శివాజీ తెలిపారు. -
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
రంగారెడ్డి: షాబాద్ మండల కేంద్రంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో గురువారం దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన, సీతారాముల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోశ్చరణల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని అన్నారు. భగవంతునిపై విశ్వాసం ఉంచి నిత్యం పూజిస్తే తప్పక కరుణిస్తాడన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్‌యాదవ్, ఎంపీటీసీ సభ్యులు సత్యనారాయణ. కుమార్, నాయకులు కూర వెంకటయ్య, రాఘవరెడ్డి, పాపిరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, మదన్‌గుప్తా, వేదపండితులు కిష్టయ్యజోషి, శ్రీనుపంతులు తదితరులు పాల్గొన్నారు. (షాబాద్)