సంపూర్ణేశ్‌బాబు గుర్తొచ్చాడు | soggade shobhan krishna PRESSMEET | Sakshi
Sakshi News home page

సంపూర్ణేశ్‌బాబు గుర్తొచ్చాడు

Published Mon, Dec 11 2017 2:09 AM | Last Updated on Mon, Dec 11 2017 2:09 AM

soggade shobhan krishna PRESSMEET - Sakshi

శోభన్‌ కృష్ణ, ఝాన్సీ జంటగా రూపొందిన చిత్రం ‘సోగ్గాడే.. శోభన్‌కృష్ణ’. జింకా హరిబాబు దర్శకత్వంలో శ్రీశ్రీ నాగలక్ష్మి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రాగీర్‌ ఉమాపతి గౌడ్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథాచిత్రమిది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. శోభన్‌కృష్ణ చక్కని నటన కనబరిచాడు. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టైలర్‌ చూసిన తర్వాత నాకు సంపూర్ణేశ్‌ బాబు గుర్తొచ్చారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది. తప్పకుండా హిట్‌ అయి టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నటి కవిత. శోభన్‌ కృష్ణ, ఝాన్సీ, జింకా హరిబాబు, రాగీర్‌ ఉమాపతి గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement