Shobhan
-
యూత్‌ఫుల్ మ్యాడ్ – నాగవంశీ
‘‘మ్యాడ్’ యూత్‌ఫుల్ సినిమా అయినప్పటికీ కుటుంబమంతా చూసేలా ఉంటుంది. లాజిక్‌లు, ట్విస్ట్‌లు ఉండవు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నవ్వుతూనే ఉంటారు. ‘జాతి రత్నాలు’ చిత్రం కంటే ఒక్కసారైనా తక్కువ నవ్వానని ఎవరైనా చెబితే.. టిక్కెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాం’’ అని నిర్మాత నాగవంశీ అన్నారు. రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మ్యాడ్’. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ–‘‘నా ‘జాతిరత్నాలు’ కంటే ‘మ్యాడ్’ బాగా నచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో వినోదం మాత్రమే ఉంటుంది’’ అన్నారు కల్యాణ్ శంకర్. -
‘లైగర్’ పెట్టుబడులపై ఈడీ దూకుడు
సాక్షి, హైదరాబాద్: లైగర్ చిత్రానికి పెట్టుబడులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి దృష్టి సారించింది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత పూరీ జగన్నాథ్‌తోపాటు చార్మీని, ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి విదితమే. కాగా, శుక్రవారం సినీ ఫైనాన్షియర్ శోభన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ సినిమాలో ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారు?.. పెట్టుబడిగా పెట్టారా?.. లేక ఫైనాన్స్ చేశారా?.. చేస్తే ఆ డబ్బు ఎలా సర్దుబాటు చేశారు?.. దానికి సంబంధించిన లావాదేవీలు ఎలా జరిగాయన్న అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఈ సినిమా పెట్టుబడులపై ఇదివరకు పూరీ జగన్నాథ్, చార్మి, విజయ్ను ప్రశ్నించినప్పుడు, శోభన్‌ను ప్రశ్నించినప్పుడు ఈడీ అధికారులు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. ఇదీ చదవండి: విజయ్‌కి ‘లైగర్’ సెగ! -
డాక్టర్ సాబ్ టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్లో శోభన్ హీరోగా డీఎస్బీ దర్శకత్వంలో ఎస్పీ నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శివ సంగీతం అందిస్తుండగా ఎన్. ప్రభాకర్ రావు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 1400 సినిమాలకు పైగా ఫైట్ మాస్టర్‌గా పనిచేసిన విక్కీ మాస్టర్ ఈ సినిమాకు సమర్ఫిస్తుండటం విశేషం. కాగా శుక్రవారం ఈ సినిమాకు సంబందించిన టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్స్ చేసిన సేవని మరువలేం. వారు నిజమైన దేవుళ్ళు. అలాంటి డాక్టర్స్‌లో ఒకరు శోభన్. అయన హీరోగా నిర్మాతగా చేస్తున్న సినిమా డాక్టర్ సాబ్. ఈ మూవీ లోగోని నేను విడుదల చేయడం సంతోషంగా ఉంది. నా చిరకాల మిత్రుడు విక్కీ మాస్టర్ ఈ సినిమాను సమర్పిస్తుండం సినిమాపై అంచనాలను పెంచుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మూవీ యూనిట్‌కు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విక్కీ మాస్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసిన నా మిత్రుడు సురేష్‌కు ధన్యవాదాలు. తన శిష్యులైనా శోభన్, సురేష్‌లు ఈ చిత్రానికి ఎంతో కష్టపడి స్క్రిప్ట్ రాశాన్నారు. డాక్టర్ అనేవాడు దేవుడు అని చెప్పే సినిమానే ఇది. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరు తెస్తుంది. అందరికి ఈ సినిమా నచ్చుతుందని ఆయన అన్నారు. అలాగే దర్శకుడు డీఎస్బీ మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. తనను నమ్మి ఈ సినిమాని తెరకెక్కించిన ఈ చిత్ర నిర్మాత, హీరో శోభన్ కృతజ్ఞతలు తెలిపారు. మా కోరికను మన్నించి ఈ సినిమా టైటిట్‌ను ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందన్నారు. హీరో శోభన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ వినగానే హీరోగా చేయాలనిపించిందని అన్నాడు. ఈ సినిమా చేయడానికి కారణం విక్కీ మాస్టర్ అని, అయన సినిమాకు మొదటి నుంచి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదని పేర్కొన్నాడు. దర్శకుడు సురేష్ సహకారం బాగా ఉందని, సినిమా బాగా చేశాడని తెలిపాడు. అలాగే తమ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరించిన నిర్మాత సురేష్ కొండేటి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. -
‘టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూకంపం’
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాగ్దానం చేసిన పెన్షన్ స్కీం చూసి టీఆర్ఎస్ నేతల కాళ్ల కింద భూమి కంపించడం మొదలైందని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ ఎద్దేవా చేశారు. గాంధీ భవన్లో మాట్లాడుతూ.. 2011లో కాంగ్రెస్ సర్కార్ పెన్షన్ వయసును 65 నుంచి 60 ఏండ్లకు తగ్గిస్తే.. తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్లకు పెంచిందని విమర్శించారు. పెన్షన్ వయసు 60 నుంచి 65కు పెంచడం వల్ల కేంద్ర నుంచి వస్తోన్న నిధులు కూడా తెలంగాణ సర్కారే తింటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చే పెన్షన్ వల్ల కుటుంబాల్లో గొడవలు పడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాలపై బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కు కాదా.. హామీ ఇచ్చిన బోధకాలు పెన్షన్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను టీఆర్ఎస్ వాళ్లు ఏమైనా అనవచ్చు..కానీ కాంగ్రెస్ కేవలం ఒక బచ్చా అంటే లేసి పడుతున్నారు..మీ టాలెంట్ అంతా తెలంగాణ సంక్షేమం కోసం చూపెడితే బాగుంటుందని హితవు పలికారు. ఇంటింటి సర్వే రూ.50 కోట్లు ఖర్చు పెట్టారు..దాని ఫలం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలకు ఎక్కడా ఫలితాలు రావడం లేదు..కానీ కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రం అందుతోన్నాయని విమర్శించారు. పోలీసుల మీద అనుమానం వస్తోంది : వీహెచ్ తెలంగాణ పోలీసుల మీద ఒక విషయంలో అనుమానం వస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. నయీమ్ కేసులో బాధితులను పట్టించుకునే నాధుడే లేడని వ్యాఖ్యానించారు. నయీమ్ అనుచరుడు శేషన్నను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనను వాడుకునే ప్రయత్నం చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శేషన్నను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు. నయీమ్ గ్యాంగ్‌ను శేషన్న ఇంకా రక్షిస్తున్నాడని ఆరోపించారు. శేషన్నకు టికెట్ ఇచ్చి కేటీఆర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేయిస్తాడేమోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
సంపూర్ణేశ్‌బాబు గుర్తొచ్చాడు
శోభన్ కృష్ణ, ఝాన్సీ జంటగా రూపొందిన చిత్రం ‘సోగ్గాడే.. శోభన్‌కృష్ణ’. జింకా హరిబాబు దర్శకత్వంలో శ్రీశ్రీ నాగలక్ష్మి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాగీర్ ఉమాపతి గౌడ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథాచిత్రమిది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. శోభన్‌కృష్ణ చక్కని నటన కనబరిచాడు. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టైలర్ చూసిన తర్వాత నాకు సంపూర్ణేశ్ బాబు గుర్తొచ్చారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది. తప్పకుండా హిట్ అయి టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నటి కవిత. శోభన్ కృష్ణ, ఝాన్సీ, జింకా హరిబాబు, రాగీర్ ఉమాపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రుల అందాల నటుడు ఎప్పటికీ శోభన్బాబేనని మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో శోభన్‌బాబు 79వ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ సుధాకర్ బాబు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి తదితరులు కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన ఆమని గ్రూపు గాయకులు, ప్రముఖ కళాకారిణి సుధారాణి ఆలపించిన సినీ గేయాలు ఆహూతులను అలరించాయి. కోట్ల మాట్లాడుతూ సినీ ప్రపంచంలో మచ్చలేని హీరో శోభన్‌బాబు ఒక్కరేనన్నారు. ఆయన పేరిట స్థాపించిన సేవా సమితి ద్వారా ఎమ్మెల్సీ సుధాకర్ బాబు చేస్తున్న సేవ కార్యక్రమాలను అభినందించారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ శోభన్‌బాబు మృతి చెంది ఆరేళ్లు గడిచినా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తుండటం అభినందనీయమన్నారు. వేడుకలకు 50 ఏళ్లు దాటిన వారే అధికంగా హాజరయ్యారంటే ఆయనపైనున్న మమకారం ఎలాంటిదో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు మాట్లాడుతూ శోభన్‌బాబు చూపిన దారిలోనే తాము పయనిస్తున్నట్లు చెప్పారు. విలక్షణమైన నటనలో ఆయన శాశ్వతంగా ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. అనంతరం కర్నూలుకు చెందిన ప్రముఖ రచయితలు చంద్రశేఖర కల్కూర, జేఎస్ఆర్కే శర్మ, వైద్యం వెంకటేశ్వర ఆచారి, సుబ్బలక్ష్మిలను.. నాలుగు దశాబ్దాలుగా నాటక రంగంలో సేవ చేస్తున్న బీసీ కృష్ణ, రిటైర్డ్ మార్కెట్ కమిటీ సెక్రటరీ చంద్రన్న, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, ప్రముఖ హార్మోనిస్ట్, రిటైర్డ్ ఎంపీడీఓ శ్రీనివాసులును శోభన్‌బాబు సేవా సమితి తరపున సన్మానించారు. సుబ్బలక్ష్మి తరపున ఆమె భర్త వెంకటరమణను సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సర్దార్‌బుచ్చిబాబు, సలాం, తిప్పన్న, శోభన్‌బాబు అభిమాన సంఘం నాయకులు జోగారావు, శివకుమార్, ఆర్వి.రమణ, జి.నాగరాజు, ప్రముఖ రచయిత యలపర్తి రమణయ్య పాల్గొన్నారు.