Viral Shweta Memes: Who Is Shweta And Why Her Memes Trending On Social Media - Sakshi
Sakshi News home page

Shweta Memes: ఎందుకింతలా ట్రెండవుతోంది!

Published Fri, Feb 19 2021 8:09 AM | Last Updated on Fri, Feb 19 2021 1:30 PM

Who is Shweta And Why Are Shweta Memes Trending Online, Here It Is - Sakshi

సోషల్‌ మీడియాపై లుక్కేస్తే గురువారం అంతా ఓ పేరుతో కూడిన హ్యష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. ఎవరనుకొని వెంటనే ట్విటర్‌ పిట్టలో వెతికితే మీరు గుర్తు పట్టలేకపోవచ్చు ఎందుకంటే ఆ పేరు ఏ ప్రముఖ హీరోదో లేక రాజకీయ వేత్తదో, క్రికెటరో అనుకుంటే పప్పులో కాలేసినట్లో.. ఆమె ఎవరికి పరిచయం లేని శ్వేతా అనే అమ్మాయి. అవును.. ప్రస్తుతం #Shweta ట్యాగ్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఏ విషయం గురించి మాట్లాడిన ముందు ఈ హ్యష్‌ట్యాగ్‌ తగిలించే మ్యాటర్‌ చెబుతున్నారు నెటిజన్లు. ఇంతకీ అసలు ఎందుకు శ్వేతా ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా.. అసలు దీని సంగతేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆ హ్యాష్‌ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఓ ఆడియో క్లిప్ వైరల్ అయినట్లు దర్శనమిస్తుంది. 111 మంది ఉన్న జూమ్‌లో ఆన్‌లైన్ క్లాస్‌‌ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను  స్నేహితులకు పూస గుచ్చినట్లు వివరిస్తూ ఉంటుంది. అయితే పాపం శ్వేతా అనుకోకుండా తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడం మరిచిపోయి.. దానికి బదులుగా స్పీకర్‌ను మ్యూట్ చేసినట్లు ఈ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. దీంతో ఇంటి గుట్టు బజారులో పెట్టినట్లు  ఆమె తన ఫ్రెండ్‌‌ సీక్రెట్స్ అన్ని క్లాస్ మొత్తానికి చెప్పేస్తుంది. శ్వేతా ఈ వీడియోలో తన స్నేహితుడు తన రహస్యాలన్నింటినీ ఎలా పంచుకున్నాడో వివరంగా చెబుతుంది.

లైంగిక వాంఛ కలిగిన తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎన్నిసార్లు ఔటింగ్‌కు తీసుకెళ్ళాడో చెప్పాడని.. అతను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని.. ఆ అమ్మాయి మాత్రం అతడిని ఉపయోగించుకుంటోందని శ్వేతా అంటుంది. ” నాకు కూడా తెలియదు. అతను ఆమెను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అయితే ఆమె ఓ సెక్స్ బానిస… అతడు ఎట్రాక్షన్ వల్ల ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సెక్స్ కూడా చేశాడు.” అని శ్వేతా తెలుపుతుంది. ఓ వైపు శ్వేతా చెబుతుంటే ఆన్‌లైన్ జూమ్ క్లాసులో ఉన్న మిగతా క్లాస్‌మేట్స్ ఈ అంశంపై శ్వేతాని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెకు వినబడదు. ఎందుకంటే ఆమె తన స్పీకర్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు వరుస మీమ్స్‌తో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనితో శ్వేతా ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. మరి ఆ మీమ్స్‌పై మీరు కూడా ఓ కన్నేయండి.
చదవండి: మలాలను చంపేస్తాం.. సంచలన హెచ్చరిక!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement