ప్రేమల్లో తేడా! | premisthe poye kaalam movie ready for release | Sakshi
Sakshi News home page

ప్రేమల్లో తేడా!

Published Thu, Oct 16 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

ప్రేమల్లో తేడా!

ప్రేమల్లో తేడా!

 ‘‘ ‘ప్రేమిస్తే పోయే కాలం’. ఈ టైటిల్ విన్నవాళ్లందరూ ‘ఇదేం టైటిల్.. విచిత్రంగా ఉందే’ అనుకున్నారు. అదే ఈ చిత్రానికి మంచి ప్రచారాస్త్రం అయ్యింది’’ అన్నారు నిర్మాత డి.ఇ రాజు. ప్రవీణ్‌కుమార్, శ్వేత జంటగా జి. రవిచంద్ర దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘ప్రేమిస్తే పోయె కాలం’. రమణేశ్వరి సమర్పణలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తల్లిదండ్రులు, తోడబుట్టినవాళ్ల ప్రేమ గురించి పెద్దగా ఎవరూ చెప్పుకోరు. అదే ఎవరైనా ప్రేమలో పడితే దాని గురించి వాడిగా వేడిగా చర్చించుకుంటారు. ఆ ప్రేమలకు, ఈ ప్రేమకు గల తేడా ఏంటి? అనే కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement