సాక్షి, ముంబై: దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోదరుడు సుశాంత్ మరణం తరువాత సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ వస్తున్న ఆమె సడన్ గా సోషల్ మీడియా నుంచి నిష్క్రమించారు. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బుధవారం తొలగించారు. జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ పోరాడుతున్న శ్వేతా తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక కారణాలు ఇంకా వెలుగులోకి రాలేదు. సుశాంత్ తమను వీడి నేటితో (అక్టోబర్14) నాలుగు నెలల అయిన సందర్భంగా "నిజమైన ప్రేరణ" అంటూ ఒక వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ఇంతలోనే ఆమె తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అయితే ఫేస్ బుక్ అకౌంట్ మాత్రం యాక్టివ్ గానే ఉంది.
మరోవైపు సుశాంత్ అనుమానాస్పద మరణం కేసులో రాబ్తా డైరెక్టర్ దినేష్ విజన్ కార్యాలయం, ఇంటిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం దాడులు చేసింది. మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తులో భాగంగా దినేష్ విజన్‌తో సంబంధం ఉన్న నాలుగు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. 2016 లో రాబ్తా మూవీకిగాను సుశాంత్‌కు చేసిన చెల్లింపులపై దర్యాప్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment