సాక్షి, విశాఖపట్నం: వివాహిత శ్వేత మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్వేత అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో శ్వేత పేరెంట్స్ ఆరోపణల మేరకు, సూసైడ్ లెటర్ ఆధారంగా ఆమె.. భర్త, అత్త, మామ, ఆడపడుచు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో వారిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక, పోలీసులు.. శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. మరోవైపు.. శ్వేత కేసులో పోస్టుమారం రిపోర్టు కీలకంగా మారనుంది.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో మరో ఊహించని మలుపు చోటుచేసుకుంది. శ్వేతను ఆమె భర్త మణికంఠ, అత్తమామలు, ఆడపడుచు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తే, మణికంఠ సోదరి భర్త సత్యం లైంగిక వేధింపులకు గురి చేసినట్లు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి రమ ఫిర్యాదు చేశారు. ఒకటి రెండు సార్లు శ్వేతను ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మణికంఠ సోదరి భర్తపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అత్త, ఆడపడుచులపై వరకట్న వేధింపుల కేసు కట్టి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్వేత మృతదేహాన్ని ఆమె తల్లి, బంధువులకు అప్పగించగా.. కాన్వెంట్ కూడలి సమీపంలోని చావులమదుం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు.. శ్వేత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. ఈ కేసులో పోస్టుమార్టం నివేదికతో పాటు ఆమె సెల్‌ఫోన్ కీలకంగా మారింది. ప్రస్తుతం ఆమె కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వీడియో: ర్యాపిడో బైకర్ వికృత క్రీడ.. మహిళకు చేదు అనుభవం
Comments
Please login to add a commentAdd a comment