సంగెం : మూడేళ్లుగా ప్రేమిస్తున్నట్లు చెప్పి, వెంటపడి ఆమెను శారీకంగా లోబరుచుకుని.. తీరా ఇప్పుడు పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై అడ్డూరి ప్రవీణ్‌కుమార్ తెలి పారు. మండలంలోని తీగరాజుపల్లి గ్రామానికి చెందిన మోడెం కుమారస్వామి, పుష్ప మ్మ దంపతుల కూతురు శ్వేత(20)కు గవిచర్ల గ్రామానికి చెందిన గుండు సంపత్, లక్ష్మీ దం పతుల కుమారుడు రాంబాబు(22) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేత ఇంటర్ వరకు చదవి వరంగల్ నగరంలో ఓ బ్యూటి పార్లల్‌లో పని చేస్తున్నది. రాంబాబు నగరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. నిత్యం వరంగల్ న గరానికి బస్సులో వచ్చివెళుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.
ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటానని న మ్మించిన రాంబాబు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కోరితే అందుకు నిరాకరించాడు. దీంతో శ్వేత తన బంధువులతో కలిసి నెల 5న గవిచర్లలో రాంబాబు ఇంటి ఎదుట బంధువులతో కలిసి బైఠాయించి మౌనపోరాటానికి దిగింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరు తూ శ్వేత తల్లి పుష్పమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు రాం బాబును సోమవారం ఆరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు.
ప్రేమించి.. పెళ్లికి నిరాకరించిన యువకుడి అరెస్ట్
Published Tue, Dec 9 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM
Advertisement
Advertisement