దేవుడు మావైపే ఉన్నాడు: సుశాంత్ సోద‌రి | God With Us: Sushant Singh Sister Shweta On Rhea Chakraborty Arrest | Sakshi
Sakshi News home page

రియా అరెస్ట్‌: సుశాంత్ సోద‌రి హ‌ర్షం

Published Tue, Sep 8 2020 8:35 PM | Last Updated on Tue, Sep 8 2020 9:03 PM

God With Us: Sushant Singh Sister Shweta On Rhea Chakraborty Arrest - Sakshi

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో చోటుచేసుకున్న అనేక ప‌రిణామాల త‌ర్వాత‌ నేడు మ‌ధ్యాహ్నం రియా చ‌క్ర‌వ‌ర్తిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామాన్ని సుశాంత్ సోద‌రి శ్వేతాసింగ్‌ స్వాగ‌తించారు. దేవుడు త‌మ‌తోనే ఉన్నాడ‌ని వ్యాఖ్యానించారు. ఈమేర‌కు మంగ‌ళ‌వారం ట్వీట్ చేశారు. ఆమె అభిప్రాయాన్ని బ‌ల‌ప‌రుస్తూ సుశాంత్ మాజీ ప్రేయ‌సి అంకితా లోఖండే 'అవును, అక్కా' అని రాసుకొచ్చారు. (చ‌ద‌వండి: రియా.. రియా.. అంటూ అడ్డగించారు!)

కాగా సుశాంత్‌ను ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిందంటూ అత‌ని తండ్రి రియా చ‌క్ర‌వ‌ర్తిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ప‌ట్నా పోలీసులు కేసు న‌మోదు చేయ‌గా ఎన్నో ట్విస్టుల త‌ర్వాత‌ ఆ కేసు సీబీఐ చెంత‌కు చేరింది. ఈ విష‌యంలో మొద‌టి నుంచి అంకిత.. సుశాంత్ కుటుంబానికి త‌న మ‌ద్ద‌తు తెలుపుతూ వ‌స్తున్నారు. ఇదిలా వుండ‌గా సుశాంత్‌‌ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో న‌టి రియా ఎన్సీబీ అధికారుల ఎదుట సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. సుమారు 8 గంట‌ల‌పాటు విచారించారు. ఈ సంద‌ర్భంగా రియా బాలీవుడ్‌కు చెందిన 18 నుంచి 19 మంది డ్ర‌గ్స్ తీసుకుంటున్నార‌ని వెల్ల‌డించ‌డంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం మొద‌లైంది. (చ‌ద‌వండి: 8 గంటలు ప్రశ్నల వర్షం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement