ఆ రహస్యం కోసం... | Hollywood-level graphics 'Sanjeevani' Movie | Sakshi
Sakshi News home page

ఆ రహస్యం కోసం...

Published Sun, May 22 2016 11:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

ఆ రహస్యం కోసం...

ఆ రహస్యం కోసం...

ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలుంటాయి. వాటికి జవాబులు అంత సులువుగా దొరకవు. కొంత మంది ఫ్రెండ్స్ ఓ రహస్యాన్ని చేధించే క్రమంలో ప్రమాదంలో పడతారు. దాన్నుంచి ఎలా బయట పడ్డారనే కథాంశంతో ఎడ్వెంచరెస్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘సంజీవని’. మనోజ్ చంద్ర, అనురాగ్ దేవ్, తనూజ ముఖ్యపాత్రల్లో రవి వీడె దర్శకత్వంలో జి.నివాస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘రోహటాంగ్, మనాలి తదితర ప్రాంతాల్లో  చిత్రీకరణ జరిపాం.

హాలీవుడ్ స్థాయిలో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రం ఇది. ఆగస్టులో విడుదల చేయనున్నాం’’ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్.కె, విజువల్ ఎఫెక్ట్స్: వెక్టార్ ఎఫ్‌ఎక్స్, యానిమేషన్ సూపర్‌వైజర్: దేవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement