ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి | Music Director MM Keeranavani and his Son Bhairava Donated Plasma Today - Sakshi
Sakshi News home page

ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి

Published Tue, Sep 1 2020 9:41 AM | Last Updated on Tue, Sep 1 2020 1:15 PM

Music Director, Singer Keeravani Donated Plasma along with His Son - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు ఎం.ఎం. కీరవాణి మంగళవారం ప్లాస్మా దానం చేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తన కుమారుడు భైరవతో కలిసి కిమ్స్‌ ఆసుపత్రిలోని ప్లాస్మా డొనేషన్‌ వింగ్‌లో ప్లాస్మా దానం చేసినట్లు తెలిపారు. ప్లాస్మా దానం చేయడం రక్తం దానం చేసినట్లే ఉందని, అందులో భయపడవలసిన అవసరం లేదని కీరవాణి పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరు ప్లాస్మాదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న ప్రముఖులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావడాన్ని నెటిజనులు అభినందిస్తున్నారు.

చదవండి: ప్లాస్మాదాత‌ల‌కు రాజ‌మౌళి ప్రోత్సాహ‌కాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement