అల్జీమర్స్ వ్యాధిని న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్ అని అంటారు. దీని కారణంగా జ్షాపక శక్తి క్షీణించిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తీవ్రమైన మతిమరుపుగా పేర్కొనవచ్చు. దీని కారణంగా రోజు వారి కార్యకలాపాలు కూడా సరిగా నిర్వహించలేరు బాధితులు. ఇది ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించగలమే గానీ పూర్తిగా నివారించలేం. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపనహాగన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడించారు. వారి అధ్యయనంలో దానిమ్మ పండు గుణాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అల్జీమర్‌లో వ్యాధిని చికిత్స చేయండంలో 'యురోలిథిన్ ఏ' కీలమకమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి దెబ్బతిన్న మైటోకాండ్రియాను తొలగించడంలో యూరోలిథిన్ ఏ అనేది కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ యూరోలిథిన్ ఏ అనేది ఎల్లాజాటానిన్‌ల సమ్మేళనం. ఈ ఎల్లాజాటానిన్‌లు సమ్మెళనాలు అధికంగా దానిమ్మలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడూ గట్ బ్యాక్టీరియా ద్వారా రూపాంతరం చెంది 'యురోలిథిన్ ఏ'ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరిచి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధన పేర్కొంది.
ఈ దానిమ్మలో పాలీఫైనాల్స్, ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్పు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని పరిశోధనలో తేలింది. ఈ పండులో సీ, కే, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ప్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సెల్ డ్యామేజ్‌కు దారితీస్తుంది. నూర్యాన్ల క్షీణతలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన అంశం. ఈ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్టీకరించి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.
అల్జీమర్స్‌ను తీవ్రతరం చేసే అమిలాయిడ్ బీటా ఫలకాల నిక్షేపణలను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారు
అంతేగాదు ఈ దానిమ్మ పండు అల్జీరమర్స్ వ్యాధిపి సమర్థవంతంగా నియంత్రిస్తుందా? లేదా అని చేసిన అధ్యయనంలో మంచి పలితాలు వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకోసం తాము వృద్ధుల జ్ఞాపకశక్తిపై అధ్యయనం నిర్వహించగా..వారిలో గణనీయమైన మెరుగదల కనిపించిందని తెలిపారు. ఈ అధ్యయనం న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది.
అంతేగాదు ఈ దానిమ్మలో ఉండే విటమిన్లు ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తాయి. ప్రో-ఇన్‌ఫ్లమేటరీ సైటోకిన్‌ల స్థాయిలను తగ్గించి, న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి.
పైగా దీనిలోని సమ్మేళనాలు కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహించి జ్ఞాపకశక్తి పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. అంతేగాదు దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేలా చేసి దీర్ఘాయువుని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment