చాలా మంది మనసులో మెదిలే ఆలోచన ‘దీర్ఘకాలం జీవించాలి. ఆ జీవనం కూడా వీలైనంతవరకు ఆరోగ్యంగా, వృద్ధాప్యం దరిచేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ఆలోచన మీది కూడా అయితే మన శరీర కణాల ఆరోగ్యానికి మేలు చేసే మంచి అలవాట్లతో ఆయుష్షును పెంచుకోవచ్చు.ఎలా అంటే...
కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల వాటిలోని పోషకాలు వాతావరణ మార్పులను తట్టుకునేలా శరీరానికి సహజంగా అవసరమైన వాటిని సరఫరా చేస్తాయి. ఈ సీజన్‌లో దానిమ్మపండ్లు (సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు) విరివిగా లభిస్తాయి. దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో తెలిస్తే ప్రతిరోజూ ఆహారంలో వీటిని తప్పక చేరుస్తారు.
చర్మానికి మేలు..
దానిమ్మపండ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికం. ఇవి మెదడు నుండి చర్మ ఆరోగ్యం వరకు ప్రతిదానికీ మద్దతు ఇస్తాయని పరిశోధనలలో తేలింది. డాక్టర్ విసెంటె మేరా తన ‘యంగ్ ఎట్ ఏ ఏజ్’ అనే పుస్తకంలో ‘దానిమ్మపండు దాని యాంటీఆక్సిడెంట్ శక్తి కారణంగా చర్మానికి మేలు చేసే సూపర్‌ఫుడ్’ అని పేర్కొన్నారు. దానిమ్మపండులో విటమిన్– సి పుష్కలంగా ఉంటుంది, ఇది కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ‘శరీరానికి విటమిన్– సి అందినప్పుడు, కొల్లాజెన్ ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉత్తేజితమవుతుంది.
అంతర్గత సన్‌స్క్రీన్
దానిమ్మ జ్యూస్ తాగితే యూవీ కిరణాల వల్ల కలిగే ఆక్సీకరణ నుండి చర్మాన్ని రక్షించవచ్చు. ఇది దాదాపు ‘అంతర్గత సన్‌స్క్రీన్‘ లా పనిచేస్తుంది.
మెదడుకు దానిమ్మ
దానిమ్మలోని విటమిన్ బి5 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. దానిమ్మ రసం నుండి వచ్చే ఫైటోన్యూట్రియెంట్లు మెదడుపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి‘ అని యుసిఎల్‌ఎ హెల్త్ నోట్ పరిశోధకులు పేర్కొన్నారు.
చెడు కొలెస్ట్రాల్‌కు చెక్
‘చెడు‘ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. టిజి, ఎల్‌డిఎల్ అండ్ సి, హెచ్‌డిఎల్, సి స్థాయిలను మెరుగుపరచడంలో దానిమ్మ వినియోగం ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. నిరంతర ఒత్తిడి వల్ల వృద్ధాప్యం త్వరగా ప్రవేశిస్తుంది. ఒత్తిడి తగ్గించడంలోనూ, నాడీ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలోనూ కాలానుగుణంగా లభించే దానిమ్మ సరైనది.
ఎలా తినాలంటే...
దానిమ్మ గింజలు కొన్ని రకాల వంటకాలకు, సలాడ్స్‌కు మంచి రుచిని తీసుకువస్తాయి.
ఉదయం టిఫిన్‌తో పాటుగా దానిమ్మ గింజలను తినవచ్చు. అవకాడో, పిస్తాతో కలిపి చేసిన సలాడ్స్‌లోనూ చేర్చవచ్చు
అవిసె గింజలు, పెరుగుతోనూ కలిపి తినవచ్చు.
ఉడికించిన కూరగాయలపైన పెరుగు, దానిమ్మ గింజలు వేసుకొని తినవచ్చు.
దానిమ్మ పండును కడగాల్సిన అవసరం లేదు. గింజలను వేరు చేసి, తినవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment