![Beauty With Curry leaves - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/14/karivepaku.jpg.webp?itok=FrB0cHBX)
♦ ఉప్మాలోనే కాదు... కరివేపాకును ఎప్పుడూ తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే కరివేప మంచి సౌందర్య సాధనం కూడా.
♦ కరివేపాకుని శుభ్రంగా కడిగి మెత్తగా రుబ్బుకోవాలి. ఒక స్పూను కరివేపాకు ముద్దలో కొద్దిగా పసుపు కలిపి మోచేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే మోచేతుల దగ్గర నలుపు పోతుంది.
♦ వేడినీళ్లలో కరివేప ఆకులు వేసి పావుగంట తర్వాత ఆకుల్ని తీసేసి అందులో చల్లటి నీళ్లు కలుపుకుని వాటితో ముఖాన్ని కడుక్కోవాలి. వర్షాకాలంలో ఇలా చేస్తే మంచిది. తరచూ ఇలా చేయడం వల్ల మొటిమల సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment