ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్‌లో బావుంటుంది | How To Make Curry Leaves Pickle Recipe In Telugu - Sakshi
Sakshi News home page

Curry Leaves Pickle : ఆరోగ్యానికి చాలా మంచిది.. కరివేపాకుతో పచ్చడి, టిఫిన్స్‌లో బావుంటుంది

Published Tue, Aug 22 2023 4:42 PM | Last Updated on Tue, Aug 22 2023 5:38 PM

How To Make Curry Leaves Pickle Recipe In Telugu - Sakshi

కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సినవి:

కరివేపాకులు – రెండు కప్పులు; ఎండుమిర్చి – 10; చింతపండు – పెద్ద ఉసిరికాయ అంత పరిమాణం;
పొట్టుతీసిన మినపగుళ్లు – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్లు;  నువ్వులు – టీస్పూను;
ఉప్పు – రుచికి సరిపడా; పచ్చికొబ్బరి తురుము – ముప్పావు కప్పు; బెల్లం – టేబుల్‌ స్పూను; ఉప్పు రుచికి సరిపడా.

తయారీ విధానమిలా:
బాణలిలో నూనెవేసి కాగనివ్వాలి. కాగిన నూనెలో మినపగుళ్లు, ఎండు మిర్చి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
► ఇదే బాణలిలో నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగిన తరువాత కరివేపాకు ఆకులు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి.
► కరివేపాకు వేగిన తరువాత దించేసి, కొబ్బరి తురుము వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
► కరివేపాకు మిశ్రమం వేడి తగ్గిన తరువాత బెల్లం వేసి మెత్తగా నూరుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ. అన్నం, చపాతీ, ఇడ్లీ, దోశల్లోకి బావుంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement