ఎసిడిటీని తగ్గించే ఏలక్కాయ | Cardamom to reduce acidity | Sakshi
Sakshi News home page

ఎసిడిటీని తగ్గించే ఏలక్కాయ

Published Tue, Oct 28 2014 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

Cardamom to reduce acidity

దినుసు ‘ఫలాలు’
 
ఏలక్కాయను వంటల్లో సువాసన కోసం వాడే దినుసుగానే పరిగణిస్తాం. కానీ ఇందులో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి.
     
కడుపులో ఎసిడిటీని తగ్గిస్తుంది. వేడి నీటిలో కానీ, టీలలో చిటికెడు ఏలకుల పొడి చల్లుకుని తాగితే కడుపులో ఒడుదొడుకులు అదుపులోకి వస్తాయి. అజీర్తి, అరుచి, ఆకలవుతున్నా తినాలనిపించకపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
     
 తల తిరుగుతున్నప్పుడు ఏలక్కాయను నమిలి తింటే సాంత్వన కలుగుతుంది.
     
 జీర్ణశక్తిని మెరుగుపరిచి అపానవాయువు సమస్యను తొలగిస్తుంది.
 
తెల్లరక్తకణాలు ఏం చేస్తాయంటే!
 హెల్త్ క్విజ్
 
 1. తెల్లరక్తకణాలు ఏం చేస్తాయి?
 2. తెల్లరక్తకణాల్లో ప్రధానమైనవి ఏమిటి?
 3. న్యూట్రోఫిల్స్ ఎలా ఉపయోగపడతాయి?
 4. లింఫోసైట్స్ ఏం చేస్తాయి?   
 5. మోనోసైట్స్ ఎందుకు ఉపయోగపడతాయి?
 6. ఇజినోఫిల్స్ కలిగించే ప్రయోజనం ఏమిటి?
 
 జవాబులు :
 1. శరీరాన్ని బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడతాయి.
 2. న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈసినోఫిల్స్, బేసోఫిల్స్
 3. శరీరానికి బ్యాక్టీరియా, ఫంగైల నుంచి రక్షణ కలిగిస్తాయి.
 4. కొన్ని రకాల వైరస్‌ల నుంచి క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.
 5. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి.
 6. కొన్ని పరాన్నజీవుల నుంచి, క్యాన్సర్లనుంచి దేహానికి రక్షణ కల్పిస్తాయి.
 
 పన్నెండేళ్ల లోపు పిల్లలకు నిమిసులైడ్ వద్దు!

 నిషేధిత మందులు
 
జ్వరం తగ్గడానికి వాడే మందుల్లో నిమిసులైడ్ ఒకటి. అయితే ఈ ఫార్ములాతో తయారైన మందులను పన్నెండేళ్ల లోపు పిల్లలకు వాడకూడదని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నిషేధం విధించింది కూడా. పన్నెండేళ్ల లోపు పిల్లలకు ప్రిస్కిప్షన్‌లో ఈ మందులను రాయకూడదని డాక్టర్లకు సూచనలిస్తూ, పిల్లలకు రాసిన ప్రిస్కిప్షన్‌లో ఈ మందులు ఉన్నప్పటికీ వారికి ఆ మందులను అమ్మరాదని దుకాణదారులకు ఆదేశాలిచ్చింది. ఈ మందు గాఢత వల్ల పిల్లల్లో హైపోథెర్మియా, కడుపులో అపసవ్యతలు, పేగుల్లో రక్తస్రావం, కాలేయానికి సంబంధించిన సమస్యల వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement