
Elaichi Health Benefits: నోటి దుర్వాసనను నివారించడానికి కొన్ని ఏలకులను నోట్లో వేసుకుని చప్పరించడం అనాదిగా మనకు తెలిసిన చిట్కానే. అయితే ఏలకులను పటికబెల్లంతో కలిపి చప్పరిస్తే నోటి దుర్వాసనను ఇంకా సమర్థంగా తగ్గించవచ్చు. అలాగే నీళ్లతో నిమ్మరసం చేసి, అందులో కొద్దిగా ఏలకుల చూర్ణం కలిపి తాగితే వాంతులు కూడా తగ్గుతాయి.
పాలమీగడలో ఏలకులను కలుపుకుని, ఆ ముద్దను చప్పరిస్తే నోటిపూత, నాలుక పూత తగ్గుతాయి. ఏలకుల చూర్ణాన్ని బట్టలో పెట్టి కొద్దికొద్దిగా వాసన చూస్తుండం వల్ల తుమ్ములు, తలనొప్పి తగ్గుతాయి. అయితే ఏలకులలో చాలా ఎక్కువగా ఔషధ గుణాలున్నందు వల్ల దాన్ని ఎప్పుడూ కొద్ది కొద్ది మోతాదులో, చాలా పరిమితంగా మాత్రమే వాడాలి.
చదవండి: (బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి)