గురుగ్రామ్‌లో జరిగిన ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సరదాగా డిన్నర్ చేద్దామని కేఫ్‌కి వెళ్లితే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది ఆ వ్యక్తులకు. డిన్నర్ చివరి టైంలో తీసుకున్న మౌత్ ప్రెషనర్ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. ఏంటా మౌత్ ఫ్రెషనర్ కథ? ఎందువల్ల అలా అయ్యిందంటే..
గురుగ్రామ్‌లో అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. చివరిగా మౌత్ ఫ్రెషనర్‌గా రూపంలోని డ్రై ఐస్‌ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. నీళ్లతో కడుక్కున్న లాభం లేకుండా పోయింది. ఐస్ నోటిలో పెట్టుకున్న ఉపశమనం లేకపోగా ఒకటే బాధ,నొప్పితో విలవిలలాడారు.
సమయానికి పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఏం తీసుకున్నారని ఆరా తీయగా..వారు తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్‌ని ప్యాకెట్‌ని చూపించారు. అది డ్రై ఐస్ అని వైద్యులు చెప్పారు. అది తీసుకుంటే మరణానికి దారితీసే యాసిడ్‌గా మారుతుందని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేంటి డ్రై ఐస్? అంత డేంజరా అంటే?..
డ్రై ఐస్ అంటే..
- కార్బన్‌డయాక్సైడ్(CO2) వాయువును శీతలీకరించి ఘనీభవించడం ద్వారా డ్రై ఎస్ ఏర్పడుతుంది. దీన్ని 1900ల ప్రారంభంలో కనుగొన్నారు. 1920లలో దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా వినియోగించటం ప్రారంభించారు.
- ఆహార, ఔషధ పరిశ్రమల్లో షిప్పింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ డ్రై ఐస్ దాదాపు 78 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో రవాణ సమయంలో పదార్థాలను స్తంభింపజేసి ప్యాకింగ్ చేయడంలో సహాయ పడుతుంది.
- అలాగే కొన్ని వ్యాక్సిన్‌లు తరలించే సమయంలో కూల్‌గా ఉంచేందుకు కూడా వినియోగిస్తారు.
- ధాన్యం ఉత్పత్తుల్లో కీటకాలు రాకుండా ఉండేందుకు వినియోగిస్తారు.
- అయితే ఈ డ్రై ఐస్ పెద్ద బ్లాక్స్ గానూ లేదా చిన్న గుళికల రూపంలోనూ వినయోగిస్తారు.
దీన్ని తప్పుగా వినియోగిస్తే ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదు. గురుగ్రామ్‌లో ఆ వ్యక్తులు కూడా అలా చేయడంతోనే రక్తపు వాంతులు కక్కుకుని విలవిలలాడటానికి కారణమయ్యింది.
ఎందువల్ల ఇలా జరుగుతుందంటే..
- పొడి మంచుకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల ఫ్రాస్ట్‌బైట్ ద్వారా చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోవడంతో హైపర్‌క్యాప్నియా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ డ్రై ఐస్‌ను బాగా వెంటిలేషన్ ఉండే వాతావరణంలో మాత్రమే బయట గాలికి బహిర్గతం చేయాల్సి ఉంటుంది.
- అలాగే కాక్‌టెయిల్ వంటి డ్రింక్‌లక పొగమంచులా కనిపించేందుకు ఈ డ్రై ఐస్‌ను ఉపయోగిస్తారు . అనుకోకుండా పానీయం నుంచి గనుక ఈ గుళికలను తీసుకుంటే ఆ వ్యక్తి అన్నవాహిక , కడుపు తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక్కడ గురుగ్రామ్ కేఫ్‌లోని వ్యక్తులు ఆ డ్రైఐస్‌ని నేరుగా లోపలికి తీసుకోవడంతోనే వారు కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్నే వైద్యులు వెల్లడించారు.
- నిజానికి ఈ డ్రై ఐస్‌ని నోటిలో పెట్టుకునే యత్నం చేయకూడదు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ కావడంతో నోటిలోని లాలజలం తేమతో కలిసి రియాక్షన్ చెందడం జరుగుతంది. ఫలితంగా తీవ్రమైన గాయాలు, కణజాల నష్టం వంటివి జరుగుతాయి. అలాగే ఈ పొడిమంచు ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్‌ని పీల్చినా ప్రాణాంతకమే. అందువల్ల పొడిమంచును వినియోగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించటం మంచిది.
(చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..)
Comments
Please login to add a commentAdd a comment