ice free
-
డ్రై ఐస్ నిజంగా అంత ప్రమాదమా?
గురుగ్రామ్‌లో జరిగిన ఘటన అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. సరదాగా డిన్నర్ చేద్దామని కేఫ్‌కి వెళ్లితే మర్చిపోలేని చేదు అనుభవం ఎదురయ్యింది ఆ వ్యక్తులకు. డిన్నర్ చివరి టైంలో తీసుకున్న మౌత్ ప్రెషనర్ ఒక్కసారిగా ఆ వ్యక్తులను ఆస్ప్రతి పాలయ్యేలా చేసింది. ఏంటా మౌత్ ఫ్రెషనర్ కథ? ఎందువల్ల అలా అయ్యిందంటే.. గురుగ్రామ్‌లో అంకిత్ కుమార్ అనే వ్యక్తి తన భార్య స్నేహితులతో కలిసి లాఫోరెస్టా కేఫ్‌కి వెళ్లి డిన్నర్ చేశారు. చివరిగా మౌత్ ఫ్రెషనర్‌గా రూపంలోని డ్రై ఐస్‌ని తీసుకోగానే వారంతా రక్తపు వాంతులు చేసుకున్నారు. నోరు మండటం, నాలుకపై పగుళ్లు వంటివి వచ్చాయి. నీళ్లతో కడుక్కున్న లాభం లేకుండా పోయింది. ఐస్ నోటిలో పెట్టుకున్న ఉపశమనం లేకపోగా ఒకటే బాధ,నొప్పితో విలవిలలాడారు. సమయానికి పోలీసులు రంగంలోకి దిగి బాధితులను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఏం తీసుకున్నారని ఆరా తీయగా..వారు తాము తీసుకున్న మౌత్ ఫ్రెషనర్‌ని ప్యాకెట్‌ని చూపించారు. అది డ్రై ఐస్ అని వైద్యులు చెప్పారు. అది తీసుకుంటే మరణానికి దారితీసే యాసిడ్‌గా మారుతుందని చెప్పడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అసలేంటి డ్రై ఐస్? అంత డేంజరా అంటే?.. డ్రై ఐస్ అంటే.. కార్బన్డయాక్సైడ్(CO2) వాయువును శీతలీకరించి ఘనీభవించడం ద్వారా డ్రై ఎస్ ఏర్పడుతుంది. దీన్ని 1900ల ప్రారంభంలో కనుగొన్నారు. 1920లలో దీన్ని వాణిజ్య ఉత్పత్తిగా వినియోగించటం ప్రారంభించారు. ఆహార, ఔషధ పరిశ్రమల్లో షిప్పింగ్ చేసేటప్పుడు ఆహార పదార్థాలు పాడవ్వకుండా ఉండేందుకు వినియోగిస్తారు. ఈ డ్రై ఐస్ దాదాపు 78 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రతతో రవాణ సమయంలో పదార్థాలను స్తంభింపజేసి ప్యాకింగ్ చేయడంలో సహాయ పడుతుంది. అలాగే కొన్ని వ్యాక్సిన్లు తరలించే సమయంలో కూల్‌గా ఉంచేందుకు కూడా వినియోగిస్తారు. ధాన్యం ఉత్పత్తుల్లో కీటకాలు రాకుండా ఉండేందుకు వినియోగిస్తారు. అయితే ఈ డ్రై ఐస్ పెద్ద బ్లాక్స్ గానూ లేదా చిన్న గుళికల రూపంలోనూ వినయోగిస్తారు. దీన్ని తప్పుగా వినియోగిస్తే ప్రమాదాలు ఫేస్ చేయక తప్పదు. గురుగ్రామ్‌లో ఆ వ్యక్తులు కూడా అలా చేయడంతోనే రక్తపు వాంతులు కక్కుకుని విలవిలలాడటానికి కారణమయ్యింది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే.. పొడి మంచుకు ఎక్కువ కాలం బహిర్గతం కావడం వల్ల ఫ్రాస్ట్‌బైట్ ద్వారా చర్మానికి తీవ్రమైన హాని కలుగుతుంది. ఇది పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ వాయువుగా మారిపోవడంతో హైపర్క్యాప్నియా ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ డ్రై ఐస్‌ను బాగా వెంటిలేషన్ ఉండే వాతావరణంలో మాత్రమే బయట గాలికి బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అలాగే కాక్టెయిల్ వంటి డ్రింక్లక పొగమంచులా కనిపించేందుకు ఈ డ్రై ఐస్‌ను ఉపయోగిస్తారు . అనుకోకుండా పానీయం నుంచి గనుక ఈ గుళికలను తీసుకుంటే ఆ వ్యక్తి అన్నవాహిక , కడుపు తీవ్రమైన కాలిన గాయాలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేగాదు తినడంలో శాశ్వత సమస్యలను కలిగిస్తుంది. ఒక్కోసారి వేగవంతమైన రియాక్షన్ కారణంగా జీర్ణ అవయవాలను చిధ్రం చేసేలా గ్యాస్ ఏర్పడి ఊపిరాడకుండా చేస్తుంది. ఇక్కడ గురుగ్రామ్ కేఫ్‌లోని వ్యక్తులు ఆ డ్రైఐస్ని నేరుగా లోపలికి తీసుకోవడంతోనే వారు కూడా ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ విషయాన్నే వైద్యులు వెల్లడించారు. నిజానికి ఈ డ్రై ఐస్‌ని నోటిలో పెట్టుకునే యత్నం చేయకూడదు. ఇది ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్ కావడంతో నోటిలోని లాలజలం తేమతో కలిసి రియాక్షన్ చెందడం జరుగుతంది. ఫలితంగా తీవ్రమైన గాయాలు, కణజాల నష్టం వంటివి జరుగుతాయి. అలాగే ఈ పొడిమంచు ద్వారా వచ్చే కార్బన్ డయాక్సైడ్ని పీల్చినా ప్రాణాంతకమే. అందువల్ల పొడిమంచును వినియోగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకుని వినియోగించటం మంచిది. (చదవండి: స్కూల్లో ఏఐ పంతులమ్మ! అచ్చం ఉపాధ్యాయుడి మాదిరిగా..) -
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు కనుమరుగు కానుందా?
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమ వుతున్న కర్బనవాయువులు ఇదే వేగంతో పెరుగుతుంటే ఈ శతాబ్దం ముగిసేలోపే గ్రీన్‌ల్యాండ్‌లోని 4.5 శాతం మంచుకొండలు కరిగిపోయే ప్రమాదం ఉందని తాజా పరిశోధన వెల్లడించింది. దానితోపాటు సముద్ర మట్టాలు 13 అంగుళాల మేర పెరిగే అవకాశం ఉందని ఆ నివేదిక హెచ్చరించింది. ఉద్గారాలను తగ్గించకపోతే 3000 సంవత్సరం కల్లా గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పూర్తిగా కరిగే అవకాశం ఉందని అమెరికాలోని అలస్కా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఆండీ ఆష్వాండెన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్‌లో 6,60,000 చదరపు కిలోమీటర్ల మేర మంచు పరచుకొని ఉంది. ఈ మంచుకొండల కింద ఉన్న ప్రాంతాల పరిస్థితులపై ఆయన అధ్యయనం చేశారు. దాదాపు 500 రకాల విభిన్న పరిస్థితులను అంచనా వేశారు. వీటిని అంచనా వేసే క్రమంలో పెద్ద మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. వాటి నుంచి కరుగుతున్న హిమ శాతాన్ని కలిపి ఈ మేరకు అంచనాలు వేశారు. 1991, 2015 మధ్య సంవత్సరానికి 0.02 శాతం చొప్పున సముద్రమట్టం పెరిగిందని అన్నారు. గ్రీన్‌ల్యాండ్‌లోని మంచు పర్వతాలను కూడా పరిగణలోకి తీసుకొని పరిశోధన చేసిన మొదటి నివేదిక ఇదే కావడం గమనార్హం. నగరాలకు ముంపు తప్పదు... ఇప్పుడు ఉన్న కర్బన ఉద్గార శాతం ఇలాగే కొనసాగితే 3000 సంవత్సరం కల్లా సముద్రమట్టం 24 అడుగులు పెరుగుతుందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రపు ఒడ్డున ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలస్, న్యూ ఓర్లాన్స్ వంటి నగరాలు సముద్రంలో మునగడం ఖాయమన్నారు. కర్బన వాయువులు పెరగకుండా జగ్రత్తలు తీసుకుంటే సముద్ర మట్టం కేవలం 6.5 అడుగులు మాత్రమే పెరిగే అవకాశం ఉందన్నారు. -
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
-
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
ఏటేటా పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా భూమి ఉత్తరధ్రువంలోని ఆర్కిటిక్ మంచుకొండలు మరో 23 ఏళ్లలో, అంటే 2040 సంవత్సరం వచ్చే ఎండాకాలంలో పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతంలో అంచనావేసిన దానికన్నా 30 ఏళ్ల ముందే ఆర్కిటిక్ మంచుకొండలు కరిగిపోతాయన్నది వారి తాజా అంచనా. గత 30 ఏళ్లలో సగానికి సగం మంచుకొండలు కరగిపోయాయి. ఇప్పటికే మొత్తంగా మూడొంతుల మంచుకొండలు కరిగిపోగా, మిగిలిన నాలుగో వంతు భాగం రానున్న 23 ఏళ్లలో కరిగిపోతుంది. మంచుకొండలు కరిగిపోవడం వల్ల నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర యూరప్ నుంచి ఈశాన్య ఆసియాకు వెళ్లాలంటే సూయెజ్ కెనాల్ మీది నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆర్కిటిక్ మంచు కొండలు కరిగిపోతే ఉత్తర జలమార్గంలో దూరం ఐదింట రెండు వంతులు తగ్గుతుంది. దక్షిణ హాలండ్‌లోని ప్రధాన ఓడరేవు అయిన రోటర్‌డామ్ నుంచి జపాన్‌లోని యొకోహమా, షాంఘై నగరాలకు ఉత్తర జలమార్గం ద్వారా త్వరగా చేరుకోవచ్చు. రోటర్‌డామ్ నుంచి యొకోహమాకు మధ్య 3,840 నాటికల్ మైళ్ల దూరం ఉంది. ఈ దూరం ప్రయాణించడానికి 9 రోజులు పడుతుంది. 2,361 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న షాంఘై నగరానికి చేరుకోవాలంటే ఐదున్నర రోజులు పడుతుంది. ప్రస్తుతం సూయజ్ కాలువ మీదుగా దక్షిణ ధ్రువాన్ని చుట్టి పోవాల్సి వస్తోంది. 2040 నాటికి ఆర్కిటిక్ సముద్రంలోని మంచు కొండలు కరిగిపోయినా ఆ మార్గం గుండా నౌకాయానం చేసే అవకాశం ఉంటుందో, లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని కారణంగా దక్షిణ ధ్రువ ప్రాంతాలకన్నా సముద్ర జలాలు వేగంగా వేడెక్కడం, తుఫానులు సంభవించడం, సముద్రం అల్లకల్లోలంగా తయారవడమే అందుకు కారణమని వారంటున్నారు. ఉత్తర జలమార్గం కోసం ఉత్తరధ్రువ ప్రాంతాల్లోని దేశాలన్నీ పరస్పర రవాణా ఒప్పందాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాయి.