చద్దన్నం ఇష్టపడనివారికి పెరుగన్నం చక్కని ప్రత్యామ్నాయం. తాజాగా వండిన అన్నంలో పెరుగు కలుపుకొని తింటే కడుపులో ఎలాంటి గడబిడ లేకుండా హాయిగా ఉంటుంది. పెరుగు కలిపిన అన్నానికి నేతితో తాలింపు వేసుకుని దద్ధోజనం కూడా చేసుకోవచ్చు. వేసవిలో మసాలాలు దట్టించిన వంటకాలకు బదులు పెరుగన్నం లేదా దద్ధోజనం తినడం చాలా శ్రేయస్కరం.
దద్ధోజనం వినియోగం చాలాకాలంగా ఉంది. ఆలయాల్లో నైవేద్యంగా కూడా దీనిని పెడతారు. పెరుగును సంస్కృతంలో ‘దధి’ అంటారు. అందువల్ల పెరుగన్నానికి ‘దద్ధ్యోదనం’ అనే పేరు వచ్చింది. వాడుకలో దద్ధోజనం అయింది. దీనికి నేతి తాలింపులో ఉపయోగించే ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు వంటి సంబరాల వల్ల అదనపు రుచి ఏర్పడుతుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, తగుమాత్రం కొవ్వులు కలిగిన దద్ధోజనం వేసవిలో తినడానికి అనువైన చక్కని పోషకాహారం.
చదవండి: Ambali Health Benefits: అంబలి తాగుతున్నారా.. స్థూలకాయం, మధుమేహం.. ఇంకా
Comments
Please login to add a commentAdd a comment