ప్రతీకాత్మక చిత్రం
Summer Care- Health Tips In Telugu: ఇది ఎండాకాలం కాబట్టి మనం పని చేసే లేదా పడుకునే గదులలో ఏసీ లేదా కూలర్ వేసుకోవడం సర్వ సాధారణం. అయితే ఎక్కువసేపు ఏసీ గదిలో గడపడం వల్ల రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఎందుకంటే ఏసీ మన గదిలో ఉన్న గాలిని చల్లబరచడం వల్ల వొంటికి చెమటలు పట్టక దాహం వేయదు. అందువల్ల నీళ్లు సరిగా తాగం.
దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. అదేవిధంగా కొందరికి ఒక్క వేసవిలోనే కాదు, ఇతర కాలాల్లో కూడా ఏసీలోనే గడపడం అలవాటు. ఇలాంటివారు బయటికి వస్తే శరీరం కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉండి, ఎండలోకి రాలేరు. దీనిమూలంగా శరీరానికి ఎండ తగలక, డీ విటమిన్ అందదు. ఫలితంగా ఎముకలు దృఢంగా ఉండక ఫెళుసు బారిపోతుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment