ఎండాకాలం వచ్చిందంటే.. పిల్లలే కాదు పెద్దలు కూడా స్నాక్స్ బదులుగా ఐస్‌క్రీమ్‌నే కోరుకుంటారు. అలాంటి వారికి ఈ మినీ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి మేకర్‌లా లేదే? చిన్నగిన్నెలా కనిపిస్తుందే అనుకుంటున్నారా? అదే దీని ప్రత్యేకత. హైక్వాలిటీ స్టెయిన్‌లెస్ స్టీల్‌లో రూపొందిన ఈ బౌల్‌ని 12 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
అలా చేస్తే ఐస్‌క్రీమ్ రెసిపీ సిద్ధం చేసుకున్న 10 నిమిషాల్లోనే.. ఈ బౌల్ చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. అదెలా అంటే లిక్విడ్ రూపంలో ఉన్న రెసిపీని ఇందులో పోసుకుని స్పూన్‌తో బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. అలా చెయ్యగా చెయ్యగా గడ్డ కట్టి పదే పది నిమిషాల్లో ఐస్‌క్రీమ్ తయారవుతుంది. ఇలాంటి బౌల్స్ ఫ్రిజ్‌లో ఉంటే.. ఎవరికి వారే అప్పటికప్పుడు ఐస్‌క్రీమ్ తయారు చేసుకుని తినొచ్చు.
ధర : 29 డాలర్లు (రూ.2,215)
చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. పెళుసైన పెదాలు.. ఈ క్రేజీ పెన్‌తో చెక్!
Comments
Please login to add a commentAdd a comment